Begin typing your search above and press return to search.
మూడు భాషలు కవర్ చేస్తున్న నాగ్
By: Tupaki Desk | 7 Sep 2018 5:30 PM GMTఅక్కినేని నాగార్జున కు ఒక స్పెషాలిటి ఉంది. సీనియర్ హీరోల్లో ఇతర బాషలలో హిట్స్ సాధించిన వారు లేరు. కానీ నాగ్ మాత్రం హిందీ 'శివ' తో సూపర్ హిట్ సాధించాడు. బాలీవుడ్ టాప్ హీరోల హిందీ సినిమాలలో కీలకపాత్రలు పోషించాడు. అంతే కాదు తమిళంలో కూడా నాగ్ స్ట్రెయిట్ చిత్రాలలో నటించాడు. కానీ చాలా ఏళ్ళుగా తనను తాను తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మార్చాడు.
తెలుగుతో రెగ్యులర్ సినిమాలతో పాటుగా ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' అనే బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది కాకుండా తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో తమిళ నటులు శ్రీకాంత్ - ఎస్ జె సూర్య - శరత్ కుమార్- అదితి రావు యైదరీ- మేఘా ఆకాష్ లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేనాండాల్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నాగార్జున గెటప్ డిఫరెంట్ గా ఉంటుందట. ఇరవై నిముషాల పాటు కనిపిస్తాడట.
సో.. అక్కినేని వారు మూడు భాషల్ని ఏకకాలంలో కవర్ చేస్తున్నారు. ఇవి కాకుండా మలయాళం లో కూడా ఒక సినిమా కోసం నాగ్ తో చర్చలు సాగుతున్నాయి. అది కూడా ఫైనల్ అయితే నాలుగు భాషలు. ఏదేమైనా ఈ సినిమాలు నాగ్ అభిమానులకు ఆనందాన్నిచ్చేవే.