Begin typing your search above and press return to search.

ఇప్పుడెలా.. అని ఆలోచిస్తున్న నాగ్

By:  Tupaki Desk   |   24 Nov 2018 7:53 AM GMT
ఇప్పుడెలా.. అని ఆలోచిస్తున్న నాగ్
X
సీనియర్ స్టార్.. కింగ్ నాగార్జున ఈమధ్య ఒక విషయంలో బాగా అందోళనపడుతున్నారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. స్వయంగా రంగంలోకి దిగిన తనయులకు కెరీర్లను చక్కదిద్దలేక పోవడం ఆయనను ఇబ్బందికి గురిచేస్తోందని అంటున్నారు. తన కెరీర్లో విషయంలో కూడా ఎప్పుడూ టెన్షన్ తీసుకోని ఆయన.. పిల్లల విషయంలో మాత్రం తీవ్రమైన ఆలోచనలో పడిపోయారట.

పెద్ద కుమారుడు చైతు హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దం అయిన ఇంకా స్టార్ లీగ్ కు చేరలేకపోవడం ఒక ఎత్తైతే.. ఈమధ్య ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు అన్నట్టుగా ఉంది వరస. ఇక సినిమా ఎంత హిట్ హిట్ అయినా అది పాతిక కోట్ల మార్క్ దాటకపోవడం కూడా అయనను ఆలోచనలో పడేసిందట. 'శైలజా రెడ్డి అల్లుడు' కొంత బెటరే గానీ 'సవ్యసాచి' డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ సాధించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఈ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే ఏంటనేది ఆలోచించాల్సిన విషయమే.

ఇదిలా ఉంటే చిన్న కుమారుడు అఖిల్ కెరీర్ కూడా అయనను ఇబ్బంది పెడుతోందట. అఖిల్ మొదటి సినిమా నుండి బయటకు రావడానికే చాలా సమయం పట్టింది. ఇక దగ్గరుండీ అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా 'హలో' గల్లంతవడం ఆయనను నిరాశకు గురిచేసింది. ఇక అఖిల్ నెక్స్ట్ సినిమా 'Mr. మజ్ను' పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆ సినిమా కనుక విజయం సాధించకపోతే ఏం చేయాలన్నది ఆయనకు పాలుపోవటం లేదట. ఇవన్నీ ఒక ఎత్తైతే తన సినిమాలు కూడా వరసగా ఫ్లాప్ అవుతున్నాయి.. ఈ లెక్కన అక్కినేని వారు దీన్నుండి బయట పడేందుకు ఏదైనా కొత్త ప్లాన్ తో రావాల్సిందే!