Begin typing your search above and press return to search.
ఆస్పత్రి పాలైన నాగశౌర్య... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 14 Nov 2022 11:35 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న సూపర్ కృష్ణ నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయన్ని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ కృష్ణ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు చెబుతుండటంతో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు కృష్ణకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.
తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త అభిమానులకు షాకింగ్ గురిచేస్తోంది. యంగ్ హీరో నాగ శౌర్య నేడు ఒక మూవీ షూటింగ్ పాల్గొన్నాడు. ఆ సమయంలోనే నాగశౌర్య హఠాత్తుగా సొమ్మసిల్లి పడి పోయాడు. గమనించిన తోటి కళాకారులు అతడిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉంటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే వరుసగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఆసత్రి పాలవుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత సైతం ఒక అరుదైన వ్యాధితో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరో కృష్ణ.. యంగ్ హీరో నాగ శౌర్య ఒక్క రోజు తేడాతో ఆస్పత్రి పాలవడంపై అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నాగ శౌర్య హీరోగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్నారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. త్వరలోనే బెంగళూరుకు చెందిన ఇంటిరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు.
ఈనెల 20న వీరిద్దరి వివాహం జరుగనున్న నేపథ్యంలో నాగశౌర్య ఇంట పెళ్లి సందడి నెలకొంది. అయితే ఉన్నట్టుండి నాగశౌర్య అస్వస్థతకు పాలవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే ఒక్క రోజు తేడాతో ఒక సీనియర్ హీరో.. యంగ్ హీరో ఆస్పత్రి పాలవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకింత ఆందోళన పరిస్థితి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.