Begin typing your search above and press return to search.
వరుడికి కూడా మాటల మాంత్రికుడి దీవెనలు
By: Tupaki Desk | 28 Oct 2021 2:40 PM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల సూపర్ వైజర్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సూపర్ వైజర్ అనే కంటే స్క్రిప్ట్ సూపర్ వైజర్ అనో స్క్రిప్ట్ డాక్టర్ అనో క్లాసిక్ గా పిలుచుకోవడం ఇండస్ట్రీలో అలవాటు. ఫ్యాక్టరీలో అయితే సూపర్ వైజర్.. క్రియేటివ్ ఫీల్డ్ లో కథా చర్చల్లో డైలాగ్ రైటింగులో అయితే స్క్రిప్టు డాక్టర్ అని అంటుంటారు. పెద్ద రచయితలంతా చేసేది ఇదే. పరుచూరి బ్రదర్స్ .. విజయేంద్ర ప్రసాద్ సహా ఆ తర్వాత జనరేషన్ లో చాలా మంది స్క్రిప్టు డాక్టర్లుగా ఇండస్ట్రీలో షాడో రోల్ పోషిస్తూనే ఉన్నారు.
ఇటీవల పవన్ కల్యాణ్ నటించే ప్రతి సినిమాకి త్రివిక్రమ్ ప్రేమేయం తప్పనిసరి అయ్యింది. అలాగే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించే ప్రతి సినిమాకి త్రివిక్రమ్ ఆదిగురువుగా మారారు. స్క్రిప్టును ఆయన పరిశీలించాకే ఫైనల్ చేస్తున్నారు. కొన్ని చిత్రాలకు ఆయన మాటలు అందిస్తున్నారు. సీన్లు రాస్తున్నారు. కథనం అల్లుతున్నారు.
తాజాగా వరుడు కావలెను చిత్రానికి త్రివిక్రమ్ ఓ చెయ్యేశారని చిత్రకథానాయకుడు నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.. త్రివిక్రమ్ రాసిన ఓ సన్నివేశంలో తాను నటించానని శౌర్య వెల్లడించారు. త్రివిక్రమ్ గారు మా సినిమాలో ఓ సీన్ రాశారు. అందులో నటించాను. ఆయన రాసిన డైలాగులు చెప్పాను అని అన్నారు. అలాగే ఈ చిత్రంలోని 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ త్రివిక్రమ్ గారికి బాగా కనెక్టయ్యిందని ప్రేక్షకులకు నచ్చుతుందని శౌర్య వెల్లడించారు. మొత్తానికి వరుడికి కూడా మాటల మాంత్రికుడి దీవెనలు అందిన విషయం ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ కి మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన ఇన్విజిలేషన్ లోనే సినిమా తెరకెక్కుతోంది.
ఇక `వరుడు కావలెను` ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి నాగశౌర్య ప్రస్థావించారు. అది రాసిపెట్టి ఉన్నప్పుడే అవుతుందని అన్నారు. తనకు కావాల్సిన అమ్మాయిపై అనవసర అంచనాలు లేవని తెలిపారు. తన మనసుకు ఏ ఇబ్బంది కలగకుండా సౌకర్యంగా చూసుకుంటానని వృత్తిపరమైన కండీషన్లు పెట్టనని కూడా నాగశౌర్య అన్నారు.