Begin typing your search above and press return to search.

బన్నీ బర్త్ డేకి మెగా సంబరాలు

By:  Tupaki Desk   |   8 April 2017 2:00 PM GMT
బన్నీ బర్త్ డేకి మెగా సంబరాలు
X
మెగా ఫ్యాన్స్ కి ఏప్రిల్ 8 పెద్ద పండుగల్లో ఒకటి. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తర్వాత.. పది రోజుల గ్యాప్ లోనే వచ్చే వేడుక కావడంతో.. సహజంగానే అప్పటి నుంచి ఇప్పటివరకూ సంబరాలు కంటిన్యూ చేసేస్తుంటారు.

ఇప్పుడు స్టైలిష్ స్టార్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. హైద్రాబాద్ లోని ఫిలిం నగర్ స్వయంగా అల్లు అర్జున్ వచ్చి కేక్ కట్ చేసి ఆప్యాయంగా అభిమానులకు తినిపించాడు. పలు జిల్లాల నుంచి వచ్చిన ఫ్యాన్స్.. ఈ వేడుకను సంబరంగా జరుపుకున్నారు. మరోవైపు ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి మరో మెగా హీరో అల్లు శిరీష్ కూడా హాజరు కాగా.. మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూడా రావడం విశేషం. ఇద్దరు అల్లు హీరోలతో మెగా బ్రదర్ బోలెడంత హంగామా చేశారు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. డీజే కొత్త పోస్టర్ ఆన్ లైన్ లో హంగామా చేసేస్తోంది. పంతులు గెటప్ లోనే యాక్షన్ మోడ్ బన్నీని ఆవిష్కరించాడు దర్శకుడు హరీష్ శంకర్. దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త మూవీ ప్రకటన కూడా రావడంతో.. బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో.. లగడపాటి శ్రీధర్-బన్నీ వాసుల నిర్మాణంలో అల్లు అర్జున్ 18వ సినిమా తెరకెక్కనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/