Begin typing your search above and press return to search.
ఆడపిల్లలను 'మెగా' కలలు కననిద్దాం
By: Tupaki Desk | 19 May 2016 4:35 AM GMTమెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి.. నాగ బాబు కూతురు నీహారిక హీరోయిన్ గా పరిచయం అవుతుందనే టాక్ వచ్చినప్పటి నుంచి అదే సెన్సేషన్. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఒక మనసు.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను పూర్తి చేసుకుంది. ఈ సమయంలో.. నీహారిక తండ్రి నాగబాబు తన మనసులోని మాటలను వివరంగా కాకపోయినా.. వీలైనంతగా చెప్పే ప్రయత్నం చేశారు.
'నా కూతురు హీరోయిన్ అవుతానంటే సపోర్ట్ చేసిన రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయిధరం తేజ్ - అల్లు అర్జున్.. ఇలా సేమ్ జనరేషన్ లో ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. కానీ వాళ్లు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి థ్యాంక్స్ చెప్పకపోయినా.. హ్యాట్సాఫ్ అంటాను. అసలు నా కూతురు హీరోయిన్ అవుతానని చెప్పినపుడు వద్దని అన్నాను. "హీరోలు వస్తున్నపుడు మాట్లాడని మీరంతా.. ఆడపిల్ల వస్తానని అన్నపుడు ఎందుకు మాట్లాడతారు" అంటూ ఒక్క ప్రశ్నతో నా నోరు మూయించింది అన్నాడు నాగేంద్ర బాబు.
'నీహారిక ఒక్కటే కాదు.. అందరి అమ్మాయిల గురించి నేను మాట్లాడని అనుకుంటున్నాను. పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసి చేతులు దులుపుకుందామని అనుకునే తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి. అమ్మాయిలకు కూడా కెరీర్ ఎంచుకునే అవకాశం ఉండాలి. వాళ్లకి పెళ్లి చేసేస్తే ఏడాదికల్లా పిల్లల్ని కనేసి జీవితం అక్కడితే ఆగిపోతుంది. అడపిల్లలను కూడా అబ్బాయిల మాదిరిగానే ఎంకరేజ్ చేద్దాం. వాళ్లకు కూడా కూడా ఎన్నో కలలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకునేందుకు సహకారం ఇద్దాం" అంటూ నీహారిక తండ్రి నాగేంద్ర బాబు చెప్పిన మాటలు ఎందరినో తట్టి లేపాయి. ఈ రేంజ్ లో నాగబాబు ఓపెన్ గా చెప్పేసిన తర్వాత... ఇండస్ట్రీలో మరింతమంది స్టార్లు తమ ఇంటి ఆడపిల్లలను హీరోయిన్లుగా పరిచయం చేసేందుకు ముందుకొస్తారేమో చూద్దాం.