Begin typing your search above and press return to search.
నగ్మాను ఆడుకుంటున్న నెటిజన్లు
By: Tupaki Desk | 7 May 2020 5:30 PM GMTతెలుగు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నగ్మా తన తరం ముగిసిపోవడంతో ఇప్పుడు రాజకీయ నేతగా మారారు. పాలిటిక్స్ లో చేరి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నగ్మా ఇటీవల ఓ టీవీ చర్చలో పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతుగా నిలిచారు. దీంతో భారతీయ నెటిజన్లు ఇప్పుడు ఆమెను టార్గెట్ చేశారు.
భారత దేశంలో ముస్లింల సమస్యలు, భారత్-పాక్ సంబంధాలపై తాజాగా ఆజ్ తక్ హిందీ చానెల్ చర్చలో నగ్మా పాల్గొంది. ఇదే చర్చలో 'తారిక్ పీర్జాదా' అనే పాకిస్తాన్ జర్నలిస్టు కూడా పాల్గొని భారత్ పై విషం కక్కాడు. దీంతో టీవీ చానెల్ ప్రతినిధి పాకిస్తాన్ జర్నలిస్టుపై మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నావంటూ కడిగిపారేశారు.
ఈ చర్చలో పాల్గొన్న నగ్మా సదురు పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతు తెలిపారు. చర్చకు పిలిచి అతడిని అవమానిస్తారా అని టీవీ చానెల్ ప్రతినిధిని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లోనూ ఆమె పాక్ జర్నలిస్టుకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ను విమర్శించిన జర్నలిస్టుకు మద్దతు తెలిపిన నగ్మా బుక్కైంది. ఆమెను తప్పుపడుతూ భారత నెటిజన్లు ఆడుకుంటున్నారు. నగ్మాను టార్గెట్ చేసి 'నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్తాన్' పేరుతో హ్యాష్ ట్యాగ్ పేరుతో ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా ఇంతేనని దుమ్మెత్తిపోస్తున్నారు.