Begin typing your search above and press return to search.
ఆ క్రికెటర్ తో ప్రేమ నిజమే.. త్యాగం చేశాను
By: Tupaki Desk | 5 March 2019 5:16 AM GMTసౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న నగ్మ అప్పట్లో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. అప్పటికే సౌరవ్ కు పెళ్లి అయినా కూడా ఈమెను రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. ఇద్దరు కలిసి తెగ తిరిగారు. పెళ్లి కోసం పూజలు కూడా చేయించుకున్నారు. త్వరలోనే పెళ్లి అంటూ అంతా భావించిన తరుణంలో వారి పెళ్లి పీఠల వరకు వెళ్లకుండానే ఆగిపోయింది.
ఆ విషయం గురించి నగ్మ ఇన్నాళ్లకు స్పందించింది. గంగూలీతో ప్రేమ నిజమే - ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే అతడు కెరీర్ కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ సమయంలో నేను కూడా ఆయన కెరీర్ పై దృష్టి పెట్టాలని భావించాను. అందుకే పెళ్లి వద్దనుకున్నాం. ఇప్పుడు ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోక పోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదని నగ్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న నేను మంచి వ్యక్తి లభిస్తే పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
అయిదు పదుల వయసుకు దగ్గర పడుతున్న నగ్మ ఇప్పటికి పెళ్లికి ఓకే చెప్పడం చిత్రంగా అనిపిస్తుంది. రాజకీయాలతో పాటు, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నగ్మను ఇప్పటికి ఎంతో మంది అభిమానిస్తూ, ఆరాధిస్తూనే ఉన్నారు. కనుక ఆమెకు మంచి వ్యక్తి తప్పకుండా దొరుకుతాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే నగ్మ పెళ్లి చేసుకోవచ్చు.