Begin typing your search above and press return to search.
షాకింగ్ః వ్యాక్సిన్ తీసుకున్న హీరోయిన్ కు కరోనా!
By: Tupaki Desk | 8 April 2021 5:30 AM GMTదేశంలో కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశకన్నా.. సెకండ్ వేవ్ లో అత్యంత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. వారూ వీరనే తేడాలేకుండా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే.. ఇప్పుడు షాకింగ్ విషయం ఏమంటే.. వ్యాక్సిన్ తీసుకున్నాకూడా కొవిడ్ పాజిటివ్ రావడం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత నగ్మా కరోనా బారిన పడ్డారు. కాస్త అనారోగ్యంగా అనిపించడంతో ఆమె.. పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే.. ఆమె అప్పటికే వ్యాక్సిన్ తీసుకుని ఉండడం గమనించాల్సిన అంశం.
ఏప్రిల్ 2వ తేదీన ముంబైలో ఆమె కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అయినప్పటికీ.. ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో.. ఆమె ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తున్నారు. కాగా.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ అటాక్ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవీషీల్డ్, కోవాగ్జిన్ ప్రభావ శీలత ఎంత అనేది సుస్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ క్లినికల్ పరీక్షలు కొసాగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి ప్రచారం నేపథ్యంలో.. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొవిడ్ అటాక్ చేసిందనే వార్తలు కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని, వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తేలిపోయింది. సో.. బీ కేర్ ఫుల్..