Begin typing your search above and press return to search.
వంగవీటి రత్నకుమారి... నైనా
By: Tupaki Desk | 2 March 2016 5:09 AM GMTనటీనటుల ఎంపికలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ఆయా పాత్రలకి నూటికి నూరుపాళ్లు సరిపోయేలా నటుల్ని ఎంపిక చేసుకొంటుంటారు. ఎక్కువగా నిజ జీవితాల్ని - సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు తెరకెక్కించే వర్మ ఆయా కథల్లోని నిజమైన వ్యక్తుల్ని పోలిన నటీనటుల్నే పట్టేస్తుంటారు. ఆమధ్య రక్తచరిత్ర కోసం పరిటాల రవి - మద్దెల చెర్వు సూరిల పాత్రల్లో వివేక్ ఒబెరాయ్ - సూర్యల్ని చూపించారు. అలాగే కిల్లింగ్ వీరప్పన్ పాత్ర కోసం సందీప్ భరద్వాజ్ లని ఎంపిక చేసుకొన్నాడు. వాళ్లు ఆయా పాత్రల్లో అచ్చుగుద్దినట్టుగా కనిపించారు.
ఇప్పుడు వంగవీటి విషయంలోనూ నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కథలో కీలకమైన వంగవీటి రత్నకుమారి పాత్ర కోసం నైనా గంగూలిని ఎంపిక చేశారు. చాలామందిని పరిశీలించిన తర్వాత ఆ పాత్ర కోసం నైనాని ఎంపిక చేశానని వర్మ చెప్పుకొచ్చాడు. ఆ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ``వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు. కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా చాలా అన్వేషించాను. చివరికి ఆ కెపాసిటీ నాకు కనిపించింది నూతన నటి నైనా గంగూలిలో. హీరోయిన్ ల బట్టలిప్పాలనే మనస్తత్వమున్న వ్యక్తుల బట్టలు కూడా కేవలం తన కళ్ళలోని తీక్షణతో విప్పగలిగే స్మితా పాటిల్ కెపాసిటీ ఉన్న మహా సీరియస్ నటి నైనా గంగూలి. అందుకే ఆమెని ఎంపిక చేశా`` అన్నారు. విజయవాడ రౌడీయిజం, రాజకీయం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం `వంగవీటి`.