Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ను పవర్ ఫుల్ మాస్ అవతార్ లో చూపించిన 'నజభజ'..!

By:  Tupaki Desk   |   27 Sep 2022 1:06 PM GMT
మెగాస్టార్ ను పవర్ ఫుల్ మాస్ అవతార్ లో చూపించిన నజభజ..!
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే 'గాడ్ ఫాదర్' సినిమా 'థార్ మార్ తక్కర్ మార్' అనే ఫ్యాన్స్ నంబర్ రిలీజ్ అయింది. చిరంజీవి - సల్మాన్ వంటి ఇద్దరు మెగాస్టార్స్ కలిసి స్టెప్పులేసిన ఈ సాంగ్.. మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం 'నజభజ' అనే రెండో పాటని విడుదల చేసారు.

'నజభజనజరా.. నజభజనజరా... గజగజ వణికించే గజరాజడిగోరా.. భుజములు జులిపించే మొనగాడడిగోరా..' అంటూ సాగిన ఈ గీతం ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. యాక్షన్ నేపథ్యంలో చిరంజీవి ని కంప్లీట్ మాస్ అండ్ పవర్ ఫుల్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌ లో ప్రెజెంట్ చేస్తోంది.

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ మరో డైనమిక్ నంబర్‌ ను కంపోజ్ చేశారు. 'అడవి తల్లికి అన్నయ్య వీడురా.. కలబడితే కథకలిరా..' అంటూ గాడ్ ఫాదర్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే సాహిత్యం అందించారు గీత రచయిత అనంత్ శ్రీరామ్. యువ గాయకులు శ్రీ కృష్ణుడు మరియు పృధ్వీ చంద్ర కలిసి తమ గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు.

'తార్ మార్ తక్కర్ మాస్' సాంగ్ 'గాడ్ ఫాదర్' లోని డ్యాన్స్ మరియు గ్రేసుని చూపిస్తే.. ఇప్పుడు 'నజభజ' పాట మాస్ అండ్ యాక్షన్ ను చూపించింది. ఇది థియేటర్ లో కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ గా ఉండబోతోందని హామీ ఇస్తోంది.

'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార - సత్య దేవ్ కీలక పాత్రలు పోషించగా.. సునీల్ - సముద్రఖని - పూరీ జగన్నాథ్ తదితరులు ఇతర ప్రముఖ పాత్రల్లో నటించారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ ఈ మెగా చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా రేపు అనంతపురంలో 'గాడ్ ఫాదర్' మెగా పబ్లిక్ ఈవెంట్ ను నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేశారు.

''గాడ్ ఫాదర్'' చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటుగా హిందీ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.