Begin typing your search above and press return to search.

నక్కినకు యస్ చెప్పిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   5 Nov 2018 4:33 AM GMT
నక్కినకు యస్ చెప్పిన స్టార్ హీరో
X
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ చాలా రోజులుగా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అడపాదడపా సోలో హీరో కథ ఉండే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చినా అవెందుకో సెట్స్ మీదకు వెళ్ళడం లేదు. తేజ తో ఒక సినిమా చేయాల్సి ఉండగా అది సైడ్ లైన్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని బ్యానర్లో ఒక సినిమా చేయాల్సి ఉంది గానీ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో సెట్ కావడంతో అది కూడా లేట్ అయ్యేలా ఉంది. ఇక ఇప్పట్లో సోలో హీరోగా వెంకీని చూడలేమని నిరాశపడుతున్న అభిమానులకు ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.

'నేను లోకల్' ఫేమ్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన రీసెంట్ గా వెంకీకి ఓ ఇంట్రెస్టింగ్ కథ వినిపించాడట. కథ దగ్గుబాటి హీరోకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది సోలో హీరో కథ అని.. ఈ కథకు మరో హీరో అవసరం లేదని సమాచారం. దీంతో వరసగా మల్టీస్టారర్ సినిమాలకు పచ్చజెండా ఊపుతున్న వెంకీ సోలో హీరో గా ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అయినట్టే. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకీ అన్నయ్య డీ. సురేష్ బాబు నిర్మిసారట.

వెంకీ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి 'F2' అనే మల్టిస్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో మల్టిస్టారర్ 'వెంకీమామ' లైన్లో ఉంది. ఈ సినిమాలో వెంకీ - నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాతో పాటుగా త్రినాధరావు నక్కిన ప్రాజెక్టును కూడా ఒకెసారి సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని వెంకీ ప్లాన్ చేస్తున్నాడట.