Begin typing your search above and press return to search.
సందీప్ కిషన్ అలాంటోడు కాదు
By: Tupaki Desk | 6 Jan 2018 7:54 AM GMTఇటీవలే ‘ప్రాజెక్ట్ జడ్’ అనే పేరుతో సందీప్ కిషన్ డబ్బింగ్ సినిమా ఒకటి రిలీజైన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమాకు అసలేమాత్రం ప్రచారం లేకపోయింది. ఏదో నామమాత్రంగా రిలీజ్ చేశారా చిత్రాన్ని. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత బషీద్ కు.. హీరో సందీప్ కు ఎక్కడో చెడింది. దీంతో సందీప్ డబ్బింగ్ లేకుండా.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా సరిగా చేయకుండా సినిమా రిలీజైంది. ఈ విషయమై తాజాగా బషీద్.. సందీప్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. సందీప్ ఈ సినిమాకు కావాలనే డబ్బింగ్ చెప్పలేదని.. ప్రమోషన్ కు పిలిచినా రాలేదని అంటూ అతడిపై తీవ్ర ఆరోపణలే చేశాడు. అదే సమయంలో సందీప్ గత సినిమా ‘నక్షత్రం’ నిర్మాతకు అతడి వల్ల గుండెపోటు వచ్చిందని వ్యాఖ్యానించాడు.
ఈ ఆరోపణలపై సందీప్ సైలెంటుగా ఉండగా.. ‘నక్షత్రం’ నిర్మాతల్లో ఒకరైన వేణుగోపాల్ మాట్లాడాడు. ‘నక్షత్రం’ సినిమా ఫ్లాపే అని.. దాని వల్ల తాము నష్టపోయిన మాటా వాస్తవమని.. కానీ సందీప్ తమను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదని వేణుగోపాల్ అన్నాడు. సందీప్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తమకు తెలుసని.. తన శరీరాన్ని నలగ్గొట్టుకున్నాడని.. అన్ని రకాలుగా సహకరించాడని.. చాలా కమిట్మెంట్ తో పని చేశాడని... అతడితో తమకు ఎలాంటి ఇబ్బందీ రాలేదని అన్నాడు. తాము ఒక సినిమాను నమ్మి తీశామని.. అది ఆడలేదని.. ఐతే జయాపజయాలకు సిద్ధపడే తాము ఈ రంగంలోకి వచ్చాం కాబట్టి అపజయాన్ని అంగీకరించామని వేణుగోపాల్ అన్నాడు. తనకు హార్ట్ అటాక్ వచ్చిందన్నది శుద్ధ అబద్ధమని.. మరోసారి ఇలాంటి అభాండాలు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వేణుగోపాల్ హెచ్చరించాడు.