Begin typing your search above and press return to search.
టీజర్: 'నల్లమల' లో అంతర్యుద్ధం మొదలైంది..!
By: Tupaki Desk | 30 Sep 2021 1:44 PM GMT'ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే.. అందంతో బంధించావే' అంటూ సిద్ శ్రీరామ్ పాడిన పాటతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ''నల్లమల''. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించి, 'బిగ్ బాస్' షోతో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు అమిత్ తివారి.. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. యాంకర్ కమ్ నటి భానుశ్రీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రవి చరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ''నల్లమల'' సినిమా టీజర్ ను దర్శకుడు దేవకట్టా విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు. '1980 జులై 23 ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలయ్యే ముందు రోజులవి. అప్పుడప్పుడే నల్లమలలో అంతర్యుద్ధం మొదలైంది' అనే మాటలతో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. స్వచ్ఛమైన ప్రేమకథ మరియు భావోద్వేగాలతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో అమిత్ తివారి నటన ఆకట్టుకునేలా ఉంది. 'ఇది పులులు ఉండే చోటు అని తెలియదా?' అని కాలకేయ ప్రభాకర్ అంటుండగా.. 'ఇక్కడ ఉన్నది కూడా పులే కదయ్యా..' అని అమిత్ మీసం మెలేస్తూ చెబుతున్నాడు. ఈ చిత్రంలో నాజర్ - తనికెళ్ల భరణి - అజయ్ ఘోష్ - ఛత్రపతి చంద్ర శేఖర్ - కాశీ విశ్వనాథ్ - చలాకీ చంటి - ముక్కు అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. డీఓపీ వేణు మురళి అందించిన విజువల్స్ - పీఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వలేదనిపించాయి. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా కలబోసిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నమో క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్ఎమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏమున్నవే పిల్ల’ పాటతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ మేరకు ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.