Begin typing your search above and press return to search.
చిరు హీరోలు.. ఆ దర్శకులు.. దెబ్బేశారు
By: Tupaki Desk | 19 April 2017 4:41 AM GMTసినిమా ఇండస్ట్రీ లో సమీకరణాలు రోజుకోలా ఉంటాయి. ఈరోజు పరవాలేదు అన్నవాడు రేపు ఎలా ఉంటాడో తెలియదు. అలాంటిది అసలు సక్సెస్ లో లేని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. హీరోలు.. దర్శకులు - టెక్నీషియన్లు ఇలా సినిమా లో ఉన్న ప్రతీ క్రాఫ్ట్ వారు ఒకటి రెండు పరాజయాలుకి తట్టుకొని నిలబడగలుగుతారు కానీ సినిమా ను నిర్మించిన నిర్మాత కి అలా కుదరదు. మొత్తం డబ్బులు తో వ్యవహారం కదా.
ఎంతో అనుభవం.. సినిమా పైన పరిజ్ఞానం ఉన్న నిర్మాతలు కూడా ఆ దెబ్బకు కనిపించకుండా పోతున్నారు. అసలే మన సినిమా పెట్టుబడి ఇబ్బడి ముబ్బడిగా పద్దతి లేకుండా తయారైంది. ఇలాంటి సమయంలో నిర్మాత పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేము. ఒక్కప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఇప్పుడు ఇదే సిట్యుయేషన్ లో ఉన్నారు. ఒక మెగా హీరో బ్రేక్ ఇచ్చినా.. మిగిలిన చిరు హీరోలు దెబ్బేశారు.
మొన్న అల్లు అర్జున్ తో తీసిన రేసుగుర్రం మంచి విజయాలు తెచ్చిపెట్టింది కానీ.. తర్వాత వరుణ్ తేజ్ తోలి సినిమా ‘ముకుంద’ నష్టాలే మిగిల్చింది. ఇది మరీ ఓవర్ బడ్జెట్ కాదు కాబట్టి అంత నష్టం లేదు. కాని దాని తరువాత సాయి ధర్మ తేజ్ తో నిర్మించిన విన్నర్ నిరాశ పరిచింది. ఈ రెండు రిజల్ట్స్ ను పక్కన పెట్టి మరి ఇప్పుడు వరుణ్ తేజ్ తో మిష్టర్ సినిమా తీశాడీయన. వరుణ్ తేజ్ మార్కెట్ కు కాస్తంత ఎక్కువ పెట్టి సుమారుగా 20 కోట్లు తో తీసాడు. సినిమా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు బుజ్జి ఆశలన్నీ గల్లంతయ్యాయ్.
బ్యాక్ టు బ్యాక్ ఇలా మెగా హీరోల సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడం ఒకెత్తయితే.. అసలు హిట్టిస్తారు అనుకున్న దర్శకులు అందరూ ముంచేయడం మరో ఎత్తు. శ్రీకాంత్ అడ్డాల.. గోపిచంద్ మలినేని.. శ్రీను వైట్ల.. ఘోరంగానే దెబ్బేశారులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/