Begin typing your search above and press return to search.

నాకు డబ్బు కన్నా పేరు ముఖ్యం : రేవంత్

By:  Tupaki Desk   |   20 Dec 2022 10:46 AM GMT
నాకు డబ్బు కన్నా పేరు ముఖ్యం : రేవంత్
X
బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు. తనకు డబ్బు కన్నా టైటిల్ ముఖ్యం కాబట్టే నాగార్జున సర్ ఇచ్చిన గోల్డ్ బాక్స్ ఆఫర్ ని కాదన్నానని అన్నాడు రేవంత్. బిగ్ బాస్ ఫైనల్ 2 లో రేవంత్, శ్రీహాన్ ఉండగా వారిద్దరిలో ఒకరు మాత్రమే విన్నర్ అవుతారని చెప్పి హోస్ట్ నాగార్జున గోల్డ్ బాక్స్ ఆఫర్ ని ఇస్తారు.

అయితే ఆ ఆఫర్ కి రేవంత్ ససేమీరా ఒప్పుకోలేదు. 40 లక్షల కన్నా తనకు టైటిల్ గొప్ప అన్నాడు. అయితే శ్రీహాన్ కూడా ముందు నో చెప్పినా పేరెంట్స్, ఇంకా బయటకు వచ్చిన మిగతా హౌస్ మెట్స్ అంతా చెప్పడంతో రేవంత్ విన్నింగ్ ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయన్నట్టుగా ఆ 40 లక్షల బాక్స్ తీసుకుని వచ్చేశాడు.

శ్రీహాన్ ఎలాగు గోల్డ్ బాక్స్ తో వచ్చాడు కాబట్టి టైటిల్ రేవంత్ సొంతమైంది. అయితే ఇదంతా బాగానే ఉండగా అసలు ఓటింగ్స్ ప్రకారం ఎవరు టాప్ లో ఉన్నారో తెలుసా అని నాగార్జున ఓ ట్విస్ట్ ఇచ్చారు. అందరికన్నా శ్రీహాన్ కి ఎక్కువ ఓటింగ్ వచ్చాయని చెప్పారు. దానితో ప్రేక్షకులు తనని గెలిపించారని శ్రీహాన్ సంతోషపడ్డాడు. ఇక ఎటొచ్చి టైటిల్ గెలిచినా కూడా రేవంత్ ఫేస్ లో అంత జోష్ కనిపించలేదు.

అంతేకాదు విన్నింగ్ ఎమౌంట్ లో శ్రీహాన్ కే 40 లక్షల దాకా ఇచ్చేశారు. ఇవన్ని చూస్తుంటే బిగ్ బాస్ 6 ఫైనల్ ఎపిసోడ్ లో రేవంత్ కి తీవ్ర అన్యాయం జరిగినట్టే అనిపిస్తుంది. విన్నర్ శ్రీహాన్ అని తెలిసి అసలు నాగార్జున ఎందుకు అతన్ని గోల్డ్ బాక్స్ తీసుకునేలా ఒప్పించారని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో రేవంత్ విన్నర్ అని హడావిడి చేస్తుంటే తీరా చివర్లో శ్రీహాన్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయని నాగార్జున చెప్పడం ఏంటని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు.

అయితే ఈ ఇష్యూపై రేవంత్ ఒకే ఒక్క మాట అన్నాడు. తనకు డబ్బు కన్నా టైటిల్ ఇంపార్టెంట్.. శ్రీహాన్ 40 లక్షలు అనగానే మాట మార్చేశాడు. కానీ తాను అలా కాదని అన్నారు. తనకు పేరు కావాలని అది ఉంటే డబ్బు ఆటోమెటిక్ గా వచ్చేస్తుందని అన్నారు రేవంత్. రేవంత్ టైటిల్ విన్నింగ్ అంతా కన్ఫ్యూజన్ జరుగగా.. బిగ్ బాస్ లో అతన్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన రేవంత్ ఫ్యాన్స్ మాత్రం బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.