Begin typing your search above and press return to search.

నమితా.. ఏంటీ అరాచకం..

By:  Tupaki Desk   |   23 March 2016 3:03 PM IST
నమితా.. ఏంటీ అరాచకం..
X
నిండైన భారీ సొగుసుల అతి భారీ విగ్రహం నమిత. బరువైన పరువాలతో కుర్రకారుకు వల వేసే ఈ సోయగం.. సినిమాల్లో బాగానే క్లిక్ అయింది. మొదట్లో సన్నగానే ఉన్నా.. తర్వాత బాగా లావయిపోయింది. కొంచెం తటపటాయించినా.. అదే భారీ విగ్రహంతో సినిమాలకు సై అనడం.. ఆ పర్సనాలిటీ ప్రేక్షకులు కూడా మద్దతు నివ్వడంతో వరుస సినిమాలు చేస్తూ రెచ్చిపోతోంది.

టాలీవుడ్ - కోలీవుడ్ లలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఈ భామ.. ఈ మధ్య సన్నబడిపోతానని శపథం కూడా చేసింది. ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కవుట్ అయినట్లు లేవు. దీంతో మళ్లీ తన భారీ అందాలనే స్పెషల్ అట్రాక్షన్ చేసేసింది. ఈ మధ్య ఓ ర్యాంప్ వాక్ సందర్భంగా.. నమిత క్లీవేజ్ కూడా ప్రదర్శించేయడంతో అందరూ నోళ్లు, గుడ్లు తెరుచుకుని చూడాల్సి వచ్చింది. అసలే భారీ అందాలు.. అందులోనూ అంతంతమాత్రం ఆచ్ఛాదనతో.. ఎగ్జిబిషన్ పెట్టే సరికి.. అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది.

అయినా.. ఇంతటి పర్సనాలిటీతో పబ్లిక్ లో ఈటైపు పెర్ఫామెన్స్ మాత్రం ఎవరూ ఊహించని విషయమే. ఇప్పుడు క్లీవేజ్ షో ట్రెండ్ అని భావిస్తోందో.. లేక అంతలేసి అందాలు చూపించి అందరినీ తన్మయత్వంలో ముంచెత్తాలని అనుకుందో కానీ.. అమ్మడి అరాచకం చూసినోళ్లు మాత్రం.. కెవ్వు కేక అని పాడుకుంటున్నారు.