Begin typing your search above and press return to search.
ఓటీటీలు మరీ ఇలా ఏంట్రా బాబు.. నమిత కూడా!
By: Tupaki Desk | 27 Jun 2021 11:30 AM GMTఅయిదు సంవత్సరాలకు ముందు ఓటీటీ ప్లాట్ ఫామ్ అంటే అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఇండియాలో రెండు మూడేళ్లకు ముందు ఓటీటీ అంటే ఒక్కటి రెండు పేర్లు వినిపించేవి. కాని ఇప్పుడు ఓటీటీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ ల సంఖ్య మరీ దారుణంగా యూట్యూబ్ ఛానెల్స్ లా పెరుగుతున్నాయి. సింపుల్ గా మాకు ఓ ఓటీటీ ఉందని చెప్పుకోవడం కోసం అన్నట్లుగా కొందరు ప్రారంభిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ ఓటీటీ ల్లో పెద్ద సినిమాలు విడుదల చేయలేరు.. చిన్నా చితక సినిమాలతో నెట్టుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ నమిత కూడా ఓటీటీ బాట పట్టింది.
ఇప్పటికే ఈమె నిర్మాతగా సినిమాలను నిర్మిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె నుండి ఓటీటీ ప్రకటన వచ్చింది. కరోనా లేకుండా ఉంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను వైభవంగా కార్యక్రమం నిర్వహించి లాంచింగ్ చేసేదట. కాని కరోనా కారణంగా సింపుల్ గా లాంచింగ్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కాకున్నా కరోనా తగ్గిన తర్వాత అయినా తన 'నమిత థియేటర్' ఓటీటీ ని గ్రాండ్ గా లాంచింగ్ కార్యక్రమంతో పరిచయం చేస్తానంటోంది. నమిత థియేటర్ లో మొదటగా షార్ట్ ఫిల్మ్ లు స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
నమిత ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ ను ఏర్పాటు చేసిన నమిత ప్రస్తుతం ఆ బ్యానర్ లో వావ్.. బౌ అనే సినిమాను చేస్తోంది. సినిమా లో నమిత కీలక పాత్రలో కనిపించబోతుందట. ఆ తర్వాత కీలక పాత్రను ఒక కుక్క పోషిస్తుందని అంటున్నారు. నమిత ఈ సినిమా ను పలు భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తుంది. ఒక వైపు ప్రొడక్షన్ మరో వైపు ఓటీటీ అంటూ దూసుకు పోతున్న నమిత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.
కొందరు మాత్రం నమిత ఓటీటీ విషయమై కామెంట్స్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ అంటే కోట్ల రూపాయలు పెట్టి కంటెంట్ క్రియేట్ చేయాలి అలాగే కొనాలి. అలాంటి సత్తా నమితకు ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మరీ ఇన్ని ఓటీటీలు ఏంట్రా బాబోయ్ అంటూ ఫన్నీ ఈమోజీలను నెట్టింట షేర్ చేస్తున్నారు.