Begin typing your search above and press return to search.
మెట్టెలు తాళి తప్ప తేడా లేదు
By: Tupaki Desk | 6 Dec 2017 6:52 AM GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది చివర్లో సింపుల్ గా పెళ్లి చేసుకున్న నటి నమిత. అమ్మడు టాలీవుడ్ - కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలను చేసింది. గ్లామర్ గర్ల్ గానే కాకుండా కొన్ని ప్రయోగాత్మకమైన పాత్రలను చేసి మెప్పించింది. అందంలో తేడా వచ్చినా స్టార్ ఇమేజ్ లో ఎలాంటి మార్పు రాలేదు. నమితకు కోలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా ఈ బ్యూటీ లైఫ్ ఏమి మరలేదట.
సాధారణంగా ఈ రోజుల్లో ఒక అమ్మాయికి పెళ్లైతే లైఫ్ చాలా మారిపోతుంది. కానీ నమిత మాత్రం అస్సలు మారలేదు అంటోంది. కేవలం ఒక తాళి - మెట్టెలు వచ్చాయి అంతే.. అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటి సారి తన మ్యారేజ్ లైఫ్ గురించి వివరించింది. నమిత మాట్లాడుతూ.. వీర్ తో నా లైఫ్ ప్రస్తుతం చాలా బావుంది. నేను మూడు సార్లు లవ్ లో ఫెయిల్. సో..ఒక మంచి వ్యక్తిని భర్తగా ఎంచుకోవడం నాకు చాలా ఈజీ. వీర్ ప్రపోజ్ చేసినప్పుడు నో అనడానికి చిన్న కారణం కూడా కనిపించలేదు.
మరోక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక వేళ అతను ప్రపోజ్ చేయకుంటే.. నేనె చేసేదాన్ని. పెళ్లికి కి ముందు నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతికాను. పెళ్లి తర్వాత కూడా నా లైఫ్ లో ఎలాంటి మార్పు రాలేదు. చాలా సంతోషంగా ఉన్నాను. మెట్టెలు - తాళి తప్ప నా లైఫ్ లో ఏమి తేడా లేదు. అలాగే సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకో చీర కట్టుకో అని మా అత్త మామలు ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని శ్రీమతి నమిత వీర్ వివరించింది.