Begin typing your search above and press return to search.

మ‌ల్లూ బాబుల‌కు ట్విట్ట‌ర్‌ లో వ‌లేస్తోంది

By:  Tupaki Desk   |   28 Oct 2015 7:30 AM GMT
మ‌ల్లూ బాబుల‌కు ట్విట్ట‌ర్‌ లో వ‌లేస్తోంది
X
తెలుగు - త‌మిళ్‌ - క‌న్నడ భాష‌ల్లో క‌థానాయిక‌గా చ‌క్రం తిప్పింది న‌మిత‌. చిన్నా చిత‌కా సినిమాలే అయినా కెరీర్ ప‌రంగా సాధ్య‌మైనంత ఎక్స్‌ టెన్స‌న్ కోసం ప్ర‌యత్నించింది. తెలుగులో సింహా సినిమా త‌ర్వాత త‌న‌కి రెండో ఇన్నింగ్స్ మొద‌ల‌వుతుంద‌ని ఆశించింది కానీ, ఆ బొద్దుత‌నం - భీక‌ర ప‌ర్స‌నాలిటీ చూసి తెలుగు హీరోలంతా భ‌య‌ప‌డ్డారు. అయినా తంబీలు మాత్రం అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలిచ్చి ఆదుకున్నారు.

కాల‌క్ర‌మంలో ఇక సినిమాలే లేక ఐటెమ్ నంబ‌ర్ల బాట ప‌ట్టిన ఈ సుంద‌రాంగి.. ఇటీవ‌లే మ‌ల్లూ వుడ్‌ లో ప్ర‌వేశించింది. అక్క‌డ మోహ‌న్‌ లాల్ స‌ర‌స‌న మురుగ‌న్ చిత్రంలో నాయిక‌గా న‌టిస్తోంది. అదే గాక నేరుగా లీడ్ క్యారెక్ట‌ర్‌ లో వేరొక అవ‌కాశం అందుకుందిప్పుడు. ప‌నిలో ప‌నిగా ట్విట్ట‌ర్ ఎకౌంట్ ఓపెన్ చేసి మ‌ల్లూ బాబుల్ని ఆక‌ర్షిస్తోంది. మీరు ఏం మాట్లాడాల‌న్నా నాతో నేరుగా మాట్లాడొచ్చు ట్విట్ట‌ర్‌ లో అని ఓ ఆఫ‌ర్ కూడా పెట్టింది. న‌మిత ఆకారం మ‌ల్లూవుడ్‌ కి సూట‌బుల్‌. నాటి మేటి శృంగార నాయిక‌లంతా ఇంచుమించు ఇదే ప‌ర్స‌నాలిటీతో మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ని ఏలారు. న‌మిత కంటెంట్ ప‌రంగా డి-గ్రేడ్ వ‌ర‌కూ ట‌చ్ చేసింది ఇదివ‌ర‌కే. కాబ‌ట్టి అక్క‌డ రొమాంటిక్ సినిమాల‌తో మెప్పించే ఛాన్సుంద‌నే అంటున్నారంతా.

మ‌రి న‌మిత మ‌ల్లూ కెరీర్ ఎలా సాగిస్తుందో ప్రాక్టిక‌ల్‌ గా చూడాలి. అయితే ఇన్ని చేసినా తెలుగులో మాత్రం అస్సలు మనోళ్ళు ముఖం చూస్తే ఒట్టు అన్నట్లుగా ఉంది.