Begin typing your search above and press return to search.

తెలుగు కోసం గ్లామర్ చిందించను

By:  Tupaki Desk   |   21 Jan 2016 7:30 PM GMT
తెలుగు కోసం గ్లామర్ చిందించను
X
హీరోయిన్లను గ్లామర్ కోసం వాడుకోవడంలో టాలీవుడ్ ని మించిన ఇండస్ట్రీ దేశంలో ఎక్కడా కనిపించదు. హీరోయిన్ పాత్రలను అందాల ఆరబోతలకే పరిమితం చేస్తూ.. కేరక్టర్లు సృష్టించే ట్రెండ్ కూడా మన దగ్గరే ఉంటుంది. అలాగే పక్క భాషల నుంచి హీరోయిన్స్ ను తెచ్చుకుని, వాళ్లకు భాష రాకపోయినా వాళ్లతోనే రోల్స్ చేయించుకోవడం కూడా అందాల ఆరబోతల కోసమే. తెలుగమ్మాయిలు ఎక్స్ పోజింగ్ కు అంగీకరించడం చాలా తక్కువ.

అందుకే ఇలా పక్క భాషల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే.. మళయాళీ భామ నమితా ప్రమోద్ మాత్రం కొత్తగా చెబుతోంది. ఈ అమ్మడు తెలుగులో నటిస్తుంది కానీ.. ఎక్స్ పోజింగ్ లాంటి వాటికి నేను దూరం అంటోంది. గ్లామర్ గా కనిపించడానికి అభ్యంతరం లేకపోయినా.. గ్లామర్ అంటే అందాలను ప్రదర్శించడం అంటే మాత్రం ఒప్పుకోనని చెబుతోంది నమిత. ప్రస్తుతం ఈ భామ ఆదితో కలిసి చుట్టాలబ్బాయి సినిమాలో చేస్తోంది. ఇందులు తనది ఓ క్యూట్ గాళ్ పాత్ర అని, అందుకు తగ్గట్లుగానే కనిపిస్తానని చెబుతోందీ మళయాళీ సుందరి. తెలుగు సినిమాల్లో గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉంటుందని తనకి తెలుసని, అయితే అందరి లాగే అందాలు ఆరబోయడం మాత్రం చేసేందుకు ససేమిరా అని తేల్చేసింది.

అలాగే, ఇప్పుడు తను చేస్తున్న రెండు తెలుగు సినిమాల్లోనూ ఇలాంటి ఆరబోతలకు అవసరం రాలేదని చెప్పింది నమిత. చుట్టాలబ్బాయి తర్వాత.. నారో రోహిత్ తో కలిసి కథలో రాజకుమారి మూవీలో కనిపించనుంది ఈ భామ.