Begin typing your search above and press return to search.
సిల్లీ రూమర్ అనేసిన బొద్దందం
By: Tupaki Desk | 18 Oct 2017 10:24 AM ISTప్రస్తుత రోజుల్లో రూమర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో అయితే ప్రతి ఒక్క సెలబ్రెటీ కి ఏదైనా ఒక రూమర్ చాలా ఇబ్బంది పెట్టక తప్పదు. మీడియా ఉన్నంత వరకు ఒకలా ఉన్న రూమర్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరొక లెవెల్ కి వెళ్లాయనే చెప్పాలి. ఒక్కసారి మీడియాలో రూమర్లు వస్తే సోషల్ మీడియాలో కూడా ఆ ప్రభావం బాగానే ఉంటోంది.
అయితే రీసెంట్ గా హాట్ బ్యూటీ.. బొద్దందం నమిత మీద కూడా ఎవరు ఉహించని విధంగా రూమర్ వచ్చింది. అమ్మడు ఈ మధ్యనే కొంచెం వెయిట్ లాస్ అయ్యింది. అయితే త్వరలోనే తెలుగు సీనియర్ నటుడైన శరత్ బాబుని వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా.. ముఖ్యంగా శరత్ బాబు ఆరు పదుల వయసు దాటిన వారు అలాంటిది నమిత ఎలా వివాహం చేసుకుంటుంది అనే డౌట్ కొంత మందికి వచ్చింది.
అయితే రీసెంట్ గా ఆ విషయాన్ని తెలుసుకున్న నమిత వెంటనే రూమర్స్ కి చెక్ పెట్టేసింది. రిసేంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమిళ మీడియా లో ఇంత సిల్లీ రూమర్స్ ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని కౌంటర్ వేసింది. నమిత చివరగా తెలుగులో 2010 లో సింహా అనే సినిమాలో కనిపించింది.