Begin typing your search above and press return to search.
నవతరం నాయికలకు నమిత లెస్సన్
By: Tupaki Desk | 2 Sep 2015 11:30 AM GMTసినీ ప్రపంచం అంటే మాయా ప్రపంచం. ఇక్కడ మెరిసినంత కాలమే మెరుపులు. ఏదో ఒకనాడు ఉరుమొచ్చి మీద పడక మానదు. అందుకే ఇక్కడికి చేరే కథానాయికలంతా నాలుగు రాళ్లు వెనకేసుకుని, సేఫ్ గేమ్ ఆడేస్తుంటారు. కానీ ఇలాంటి గేమ్ ఆడడంలో బొద్దుగుమ్మ నమిత ఫెయిలైందనే చెప్పాలి. తమిళ సినీపరిశ్రమ నుంచి తెలుగులో పెద్ద హీరోయిన్ గా తనని తాను ఆవిష్కరించుకునే క్రమంలో ఈ అమ్మడు పూర్తిగా తడబడింది. దాంతో కెరీర్ లో పీక్స్ కి వెళ్లలేకపోయింది. అందం ఉన్నా అభినయం సెట్టవ్వక .. నయనతార, త్రిష రేంజుకి ఎదగలేకపోయింది.
అయితేనేం గత ఇమేజ్ ని ఉపయోగించుకుని కన్నడలో పరిమిత బడ్జెట్ సినిమాల్లో పరిమిత భత్యానికే పనిచేస్తోందిప్పుడు. అయితే అనూహ్యంగా ఓ తమిళ సినిమాలో అమ్మడికి ఛాన్స్ దక్కిందిప్పుడు. ఇది నమితకు రీఎంట్రీ లాంటిదే. ఇప్పటికే తమిళం వదిలేసి నాలుగేళ్లయ్యింది. తెలుగు పరిశ్రమలో అయితే అసలే కనిపించలేదు. లేటెస్టుగా ఓ డెబ్యూ దర్శకుడు చెప్పిన కథ ఫైనల్ అయ్యింది. త్వరలోనే సెట్స్ కెళ్లనుందని సమాచారం. సేమ్ టైమ్ కన్నడలోనూ ఓ సినిమాలో నటిస్తోంది.
నమిత ఇకనైనా తమన్నా, శ్రుతిహాసన్ లా తెలివైన పెట్టుబడులతో వ్యాపారాలు చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పని చేయాలి. కనీసం సొంత ప్రొడక్షన్ పెట్టుకుని నిరంతరాయంగా నటిస్తూ ఇండస్ట్రీకి టచ్ లో ఉన్నా మంచిదే. నమిత బ్రాండ్ తో ముందుకొచ్చే కోప్రొడ్యూసర్లకేం కొదువ? ఇప్పుడర్థమైందా? నవతరం నాయికలకు నమిత జీవితం ఓ లెస్సన్ అన్న సంగతి.