Begin typing your search above and press return to search.
అనాధ పిల్లలకు 'మహర్షి' షో
By: Tupaki Desk | 28 May 2019 7:01 AM GMTసూపర్ స్టార్ మహేష్ ని అగ్ర కథానాయకుడిగా తీర్చిదిద్దిన జీవితభాగస్వామి గా నమ్రత హార్డ్ వర్క్ గురించి అభిమానుల్లో నిరంతరం చర్చ సాగుతుంటుంది. మహేష్ ప్రతి అడుగు వెనక .. గ్రాండ్ సక్సెస్ వెనక నమ్రత ప్లానింగ్ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం మహేష్ - నమ్రత జోడీ ఆలోచనల్లో ఎంతో పరిణతి- వేగం కనిపిస్తోంది. ఓవైపు సామాజిక సేవల్లోనూ తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆర్జించిన దాని నుంచి కొంత మొత్తం సామాజిక సేవలకు కేటాయిస్తున్నారు.
మరోవైపు సంఘంలో పీడిత బాధిత ప్రజలకు అంతో ఇంతో సేవ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఎంబీ మాల్ లో కొన్ని స్పెషల్ షోలను ఏర్పాటు చేసి వాటిని బధిరులకు.. అనాధ చిన్నారులకు.. వృద్ధులకు చూపించడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. `స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్` హాలీవుడ్ చిత్రాన్ని స్పెషల్లీ డిజేబుల్డ్ చిన్నారుల కోసం నమ్రత ఏర్పాటు చేశారు. దీంతో పాటు పలు చిత్రాల్ని ఎన్జీవోల కోసం వేశారు. ఇదో నిరంతర ప్రాసెస్.. సోషల్ కాజ్ కోసం నమ్రత ప్లానింగ్ సాగుతోందని తెలుస్తోంది.
తాజాగా మహేష్ నటించిన `మహర్షి` చిత్రాన్ని ఓ ఎన్జీవో అనాధ పిల్లల కోసం ప్రత్యేక షోను వేస్తున్నామని నమ్రత సోషల్ మీడియాలో తెలిపారు. `అశ్రిత & బాల తేజస్సు హోమ్స్` అనాధాశ్రయం చిన్నారుల అభ్యర్థున మేరకు ఈ షోను వేస్తున్నామని నమ్రత వెల్లడించారు. నేటితరం చిన్నారులు రైతుల సమస్యల గురించి వ్యవసాయం గురించి తెలుసుకోవడం అవసరం. సోషల్ సెన్సిటివ్.. రెస్పాన్సిబిలిటీ.. !! అంటూ నమ్రత ఆనందం వ్యక్తం చేశారు. ఫార్మర్ ఈజ్ కింగ్.. వీకెండ్ అగ్రికల్చర్ అంటూ మహర్షి గురించి వ్యాఖ్యానించడం ఆసక్తికరం.