Begin typing your search above and press return to search.

​ఫ్యామిలి చాలు నో యాక్టింగ్

By:  Tupaki Desk   |   15 Aug 2017 8:37 AM GMT
​ఫ్యామిలి చాలు నో యాక్టింగ్
X
మన నటీనటులలో సాధరణంగా ప్రతివారికి రెండు ఇన్నింగ్స్ ఉంటాయి. హీరో అయితే యంగ్ గా ఉన్నప్పుడూ హీరోగా చేసి ఆ తరువాత నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతారు. హీరోయిన్ అయితే పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అనే రెండు ఇన్నింగ్స్ ఉంటాయి. ఒకసారి నటి అయితే ఇక ఎప్పటికీ వాళ్ళు నటులుగానే ఉంటారు అనే మాట కొంతమందికి సరిపడదు. ముఖ్యంగా మన సూపర్ స్టార్ భార్యలకు. మన సూపర్ స్టార్ లు కొంతమంది హీరోయిన్లు ను పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకున్నా ఏ కొద్ది మందో హీరోయిన్లే మళ్ళీ నటించారు. ఈ మధ్య మన తెలుగు సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రతా మళ్ళీ నటించబోతుంది అనే పుకారులు వస్తున్నాయి. ఈ వార్తలుకు నమ్రతా ఇప్పుడు పనిగట్టుకొని మరి వివరణ ఇచ్చింది.

మహేష్-వంశీ పైడిపల్లి సినిమా ఓపెనింగ్కు పిల్లలతో కలిసి వచ్చిన నమ్రతను కొంతమంది మీడియా వాళ్ళు మీరు మళ్ళీ నటించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి దానికి మీ స్పందన ఏంటి అని అడిగితే “మీకు ఈ వార్త ఎవరు చెప్పరో నాకైతే తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్పింది ఫైనల్ చేసుకోండి. ప్రస్తుతం మా బిజినెస్లు చూసుకోవడానికే నాకు టైమ్ లేదు. పైగా పిల్లలు గౌతమ్ - సితారను చూసుకోవాలి. ఒకపక్క ఫ్యామిలి మరోపక్క బిజినెస్ మీరే చెప్పండి నేను ఎప్పుడు నటిస్తానో. మహేశ్ చేస్తున్న యాడ్స్, బ్రాండింగ్ అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఇంత బిజీలో నేను నటనకు న్యాయం చేయలేను అందుకే నటనకు పూర్తిగా వీడ్కోలు పలికేసాను” అని స్పష్టం చేసింది.