Begin typing your search above and press return to search.

మహేష్ పైకి మాత్రమే అలా కనిపిస్తారు

By:  Tupaki Desk   |   30 April 2018 10:47 AM GMT
మహేష్ పైకి మాత్రమే అలా కనిపిస్తారు
X
భరత్ అనే నేను గ్రాండ్ సక్సెస్ ని మహేష్ తో సమానంగా ఇంకా చెప్పాలంటే అంత కంటే ఎక్కువగా భార్య నమ్రతా శిరోద్కర్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నది నిజం. అది షూటింగ్ టైంలోనే బయటపడినప్పటికి ఇప్పుడు విజయం సాధించాక దానికి ఇంకా బలం చేకూరింది. మహేష్ వెనుక ప్రతి విషయంలోనూ తన ప్రమేయం ఉంటుందన్న వార్తల పట్ల ఒక ఇంటర్వ్యూలో నమ్రతా ఓపెన్ అయ్యారు. మహేష్ కాస్త సాఫ్ట్ గా జెంటిల్ గా ఉండే మాట నిజమే కాని ఆయన ఆలోచనా ధోరణి బయటికి కనిపించకుండా చేయటమే ఆయన స్టైల్ అంటూ క్లారిటీ ఇచ్చింది. కథల గురించి మా మధ్య చర్చ జరగడం కామన్ అయినప్పటికీ నిర్ణయం మాత్రం మహేష్ ఆలోచించి తీసుకుంటారని అంతే తప్ప ఇది చేయాలా వద్దా అనే దాని గురించి తన ప్రమేయం ఉండదని కుండ బద్దలు కొట్టేసారు.

ఒక్క కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రమే తన సలహాలు పాటిస్తారు అన్న నమ్రతా మెజారిటీ సమయాల్లో మహేష్ తనకు నచ్చినవే వేసుకుంటాడు తప్ప నేనేదో చెప్పానని కాదని కూడా చెప్పేసింది. మహేష్ తో పాటు ఫీల్డ్ లో ఉన్న ఇతర హీరోల కన్నా మహేష్ డ్రెస్సింగ్ విషయంలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తే ఆ ఒక్క విషయంలో మాత్రం క్రెడిట్ తానే తీసుకుంటాను అని చెప్పిన నమ్రతా మహేష్ లాగే కొడుకు గౌతం కూడా సిగ్గరి అనే విషయాన్నీ షేర్ చేసుకుంది. భరత్ అనే నేను విజయాన్ని ఆస్వాదిస్తున్న టైంలోనే మేడం టుస్సాడ్ మ్యుజియంలో మహేష్ విగ్రహాన్ని పెట్టడానికి టీం రావడం గురించి తమ కంటే ఎక్కువగా ఫాన్స్ ఆనందంగా ఉన్నారని చెప్పింది. మొత్తానికి మహేష్ తో జీవితాన్ని పంచుకుంటున్న నమ్రతా చెప్పిన మాటలు కాబట్టి వీటికి కాదనే ఛాన్స్ లేదు. సో పైకి ఎలా కనిపించినా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం మహేష్ ది సెల్ఫ్ స్టైల్ అని అందరికి పూర్తి క్లారిటీ వచ్చినట్టే.