Begin typing your search above and press return to search.

మహేష్ బ్రాండ్ డెవలప్మెంట్.. క్రెడిట్ ఆమెకే

By:  Tupaki Desk   |   8 Nov 2016 1:30 PM GMT
మహేష్ బ్రాండ్ డెవలప్మెంట్.. క్రెడిట్ ఆమెకే
X
అటు సినిమాల్లోనే కాదు.. ఇటు బ్రాండ్ అండార్స్ మెంట్స్ లో కూడా మహేష్ టాప్ అనే విషయం తెలిసిందే. నేషనల్ లెవెల్ లో కూడా బ్రాండ్ ప్రమోషన్స్ చేసేసే టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. ఇంతగా మహేష్ కి క్రేజ్ ఏర్పడ్డంలో.. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ వ్యూహాలు చాలానే ఉన్నాయనే మాట వాస్తవం. మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ సాధారణమైనదేమీ కాదు.. కాని దాన్ని కమర్షియల్ యాంగిల్ లో డెలవప్ చేయడం వెనక.. నమ్రత ఓ స్ట్రాటజీ ఫాలో అయిపోతుందట.

సహజంగా స్టార్ హీరోల ఫోటోలు బోలెడన్ని చక్కర్లు కొట్టేస్తూ ఉంటాయి. ఫ్యాన్స్ తో పాటు బంధువులు తెలిసిన వాళ్లు ఇలా ప్రతీ ఒక్కరూ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ మహేష్ విషయంలో మాత్రం ఇలాంటివి చాలా చాలా తక్కువగా ఉంటాయి. స్వయంగా నమ్రత కూడా.. మహేష్ ఫోటోలను చాలా తక్కువగా షేర్ చేస్తుంది. వందల్లో ఫోటోలను ఆన్ లైన్ లో ఉంచినా.. అందులో మహేష్ కనిపించేవి వేళ్లమీద లెక్కపెట్టచ్చు. వాటిలో కూడా మహేష్ బాబు ఫేస్ క్లారిటీ ఉండదు.

గుప్పిట్లో మూసి ఉంచినంత వరకే విలువ అనే సూత్రాన్ని నమ్రత ఫాలో అయిపోతుందని.. ఇప్పటికే చాలాసార్లు ఆమె వ్యూహాలు సక్సెస్ కావడంతో.. మహేష్ సపోర్ట్ కూడా ఆమెకు ఫుల్లుగా ఉంటుందని టాక్. స్టార్ హీరోల భార్యలలో ఇంతలేసి వ్యూహ చతరుత నమ్రతకు మాత్రమే సొంతం అంటారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/