Begin typing your search above and press return to search.
మహేష్ దత్తత గ్రామానికి 30 లక్షలిచ్చారు
By: Tupaki Desk | 17 Feb 2017 6:33 AM GMT‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని ఉద్దరించే కోటీశ్వరుడిగా కనిపిస్తాడు మహేష్ బాబు. ఆ సినిమా విడుదల సమయంలో నిజ జీవితంలోనూ ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టాడు మహేష్. తన తండ్రి సొంత గ్రామమైన బుర్రిపాలెంతో పాటుగా.. తెలంగాణలోని సిద్ధాపురం అనే గ్రామాన్ని కూడా మహేష్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామానికి మహేష్ తరఫు నుంచి ఇప్పుడు రూ.30 లక్షల సాయం అందింది. ఓ ట్రస్టు ద్వారా ఈ 30 లక్షల విరాళం సేకరించి.. దాని తాలూకు చెక్కును మహేష్ భార్య నమ్రత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రఘునాథరెడ్డికి అందజేసింది. ఏ హడావుడి లేకుండా సింపుల్ గా ఈ చెక్కును నమ్రత కలెక్టరుకు అప్పగించింది.
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామంలో ఈ రూ.30 లక్షలతో పాఠశాల భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం ఆల్రెడీ డిజైన్ కూడా పూర్తయింది. ఈ బాధ్యత కూడా నమ్రతే తీసుకుంది. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. ‘‘ఉదారంగా ఇంత విరాళాన్ని అందజేసినందుకు నాట్కో ట్రస్టుకు ధన్యవాదాలు. ప్రముఖ ఆర్కిటెక్ట్ సుధీర్ రెడ్డి పాఠశాల భవనం కోసం చక్కటి డిజైన్ రూపొందించారు. డ్రాఫ్ట్ అద్భుతంగా ఉంది. పాఠశాల నిర్మాణ పనుల్ని ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అని ఎదురు చూస్తున్నాం. పిల్లలు ఇందులో చదువుకుని గొప్ప స్థాయికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం. సిద్ధాపురం గ్రామాన్ని మోడల్ విలేజ్ గా మార్చేందుకు మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/