Begin typing your search above and press return to search.
మహేష్ మూవీ నమ్రత చూడదు.. కారణం?
By: Tupaki Desk | 10 May 2019 1:38 PM GMTసూపర్ స్టార్ మహేష్ సినిమా వస్తోంది అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్దీ అభిమానులు తొలిరోజే ఆ సినిమా చూసేయాలని ఆరాటపడతారు. ఆన్ లైన్ లో దొరక్కపోతే బ్లాక్ లో కొనుక్కుని మరీ అభిమానులు థియేటర్లుకు వెళుతుంటారు. అయితే వీళ్ల సంగతేమో కానీ.. మహేష్ భార్యామణి నమ్రతకు డే1 సినిమా చూసే వీలున్నా.. తను చూడనే చూడదట. దానికి కారణమేంటో తెలిస్తే షాక్ తినాల్సిందే.
నమ్రత పైనే ఎందుకంత ఒత్తిడి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వంశీ సినిమాలో మహేష్- నమ్రత కలిసి జంటగా నటించారు. ఆ టైమ్ లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా తన కెరీర్ ని త్యాగం చేసి మహేష్ కెరియర్ గురించే ఆలోచించారు. ఒక స్టార్ గా ఉన్న అతడిని సూపర్ స్టార్ గా తీర్చిదిద్దడంలో తన సహకారం ఎంతో గొప్పదని సన్నిహితులు చెబుతారు. మహేష్ 20 ఏళ్ల జర్నీలో పాతిక సినిమాల మైలు రాయిని అందుకున్నారు. ఇందులో ప్రతి సినిమాకి రిలీజ్ ముందు ఒకటే టెన్షన్ సన్నివేశం ఉంటుంది. కోట్లాది రూపాయల బడ్జెట్లతో జూదం ఇది. అందుకే ఆ టెన్షన్ ఏమాత్రం హబ్బీ మహేష్ పై పడకుండా మ్యానేజ్ చేసేందుకు నమ్రత ఎంతగానో తపిస్తారు. మహేష్ కాల్షీట్లు సహా అతడి బిజినెస్ అసైన్ మెంట్స్ అన్నీ మ్యానేజ్ చేసేది నమ్రతనే. ఇటీవల మహేష్ సినిమాల బిజినెస్ వ్యవహారాలు.. సొంత బ్యానర్ వ్యవహారాలు అన్నీ నమ్రతనే చూస్తున్నారన్న ప్రచారం ఉంది. అందుకే మహేష్ నటించే ఏ సినిమాని ఇప్పటివరకూ నమ్రత తొలి రోజు చూడలేదట. అది ఇంపాజిబుల్ అని చెబుతున్నారు.
రిలీజ్ ముందు మహేష్ ఫ్యామిలీ సభ్యులందరినీ సమీకరించి ప్రివ్యూలు వేసే బాధ్యత తనదే. అలాగే ప్రచారపరమైన ఒత్తిళ్లు తనపైనే ఉన్నాయి. ఇంట్లో కూచుని గోళ్లు గిల్లుకుంటూ ఒత్తిడిని అనుభవించే సన్నివేశం ఉంటుంది. దేవుడా ఈ సినిమా కూడా గత చిత్రంలానే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని ప్రార్థిస్తుందట. ఎందుకలా ఉన్నావ్.. చిలౌట్ చెయ్ అని మహేష్ చెప్పినా వినే పరిస్థితి ఉండదని నమ్రత ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఈ గురువారం మహర్షి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తన సన్నివేశం అదే. మహేష్ కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి ప్రివ్యూ షోలు ఏర్పాట్లు చేసింది నమ్రతనే. మరోవైపు రిలీజ్ ముంగిట ఒత్తిళ్లన్నిటినీ తనే ఫేస్ చేశారట. ఆ రకంగా భర్త ఒత్తిళ్లను ఒక భార్యగా తనే తీసుకుంటూ ఐడియల్ అనిపించుకుంటున్నారన్నమాట.