Begin typing your search above and press return to search.

మహేష్ రిలాక్స్ అవమంటాడు.. కాలేను : నమ్రత

By:  Tupaki Desk   |   12 May 2019 1:00 PM GMT
మహేష్ రిలాక్స్ అవమంటాడు.. కాలేను : నమ్రత
X
ఈ జెనరేషన్ ప్రేక్షకులకు నమ్రత సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణిగానే తెలుసు. కానీ నమ్రత మాజీ మిస్ ఇండియా అని.. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించిందని.. సౌత్ లో కూడా టాప్ స్టార్స్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిందని తక్కువమందికే తెలుసు. నమ్రత 1993 లో మిస్ ఇండియా టైటిల్.. మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సంజయ్ దత్ తో 'వాస్తవ్'.. సల్మాన్ ఖాన్ తో 'జబ్ ప్యార్ కిసీ సే హోతా హై'.. అనిల్ కపూర్ తో 'పుకార్' లాంటి సినిమాల్లో నటించారు.

ఇక తెలుగు లో చిరంజీవి చిత్రం 'అంజి' లో హీరోయిన్ గా నటించారు. మహేష్ బాబుతో 'వంశీ' సినిమాలో నటించే సమయంలో మహేష్ తో ప్రేమలో పడిపోయారు. అది వివాహ బంధంగా మారిపోయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్.. భర్త మహేష్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. 2005 లో మహేష్ తో వివాహం తర్వాత అప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు. మహేష్ కోసం సినిమాలు వదిలేయాలని తనే నిర్ణయించుకున్నానని తెలిపారు. మరి చక్కగా సాగుతున్న కెరీర్ ను వదులుకున్నారు కదా అని అడిగితే "నేనెప్పుడూ అవకాశాల కోసం ఎగబడలేదు. ఎవరిదగ్గరా చేయి చాపలేదు. సినిమాలను వదిలేసినందుకు ఏమాత్రం అసంతృప్తి లేదు" అని తెలిపారు.

బాలేవుడ్ లో పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేశానని.. అయితే ఆ సక్సెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయలేదని వెల్లడించారు. మహేష్ గురించి మాట్లాడుతూ.. మహేష్ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో తనకు చెప్పి చేస్తాడని.. తనకు ఎంతో గౌరవం ఇస్తాడని వెల్లడించారు. తన లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉందని.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అయితే మహేష్ సినిమాల విషయంలో ఎక్కువ టెన్షన్ పడతానని ఒప్పుకున్నారు. అందుకే కుటుంబ సభ్యులందరూ ప్రివ్యూ షోకు హాజరయినా తను మాత్రం ఇంట్లోనే ఉండిపోతానని తెలిపారు. అప్పటికీ మహేష్ రిలాక్స్ అవమని చెప్తాడని.. అయినా తనకు అలా చేయడం కష్టంగా ఉంటుందని తెలిపారు.