Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు షాపింగ్ కి రావాలని కోరుకోదట
By: Tupaki Desk | 12 Oct 2015 12:43 PM GMTభర్త పరిస్థితిని అర్థం చేసుకొని మెలగటం చాలామంది భార్యల్లో కనిపించదు. కానీ.. శ్రీమంతుడు.. ప్రిన్స్ మహేశ్ బాబుకు ఆ కష్టం లేదు. ఎందుకంటే.. ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్.. మహేష్ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకోగలరు. శ్రీమంతుడి సక్సెస్ తో పాటు.. వరుసగా ఒప్పుకున్న సినిమాలతో క్షణం తీరిక లేకుండా పనితో బిజీబిజీగా ఉన్న భర్తను షాపింగ్ కోసం తనతో రావాలని అస్సలు కోరుకోదట.
అదే విషయాన్ని ఆమె చెబుతూ.. ‘‘తనను నాతో కలిసి షాపింగ్ రమ్మనటం ఏ మాత్రం సరికాదు. అతనంత బిజీగా ఉంటే షాపింగ్ కు రమ్మని ఎలా చెప్పగలను. కానీ.. నేను ఎక్కువగా షాపింగ్ చేసేది తన కోసమే’’ అని చెబుతున్న నమ్రతకు.. దుబాయ్.. అమెరికాలో షాపింగ్ చేయటం ఇష్టమట.
ఇక.. తన ముద్దుల భర్త గురించి మరిన్ని కబుర్లు చెప్పుకొచ్చిన ఈ మాజీ మిస్ ఇండియా భామ.. ‘‘మహేష్ కు ఏ మాత్రం ఖాళీ దొరికినా పిల్లలతో గడపటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. గౌతమ్.. సితారలతో ఎక్కువగా ఆడుతుంటారు’’ అని చెప్పుకొచ్చారు.
ప్రిన్స్ మహేష్ బాబులోని ఒక విషయాన్ని బయటపెట్టిన ఆమె.. సడన్ గా సర్ ప్రైజ్ చేస్తూ హాలీడే ట్రిఫ్ ప్లాన్ చేయటం అలవాటని వెల్లడించారు. ఇదెంతో ఆనందానికి గురి చేస్తుందని నమ్రత పేర్కొంది. జీవిత భాగస్వామిగా ఉన్న మీరు.. తెర మీద మళ్లీ జత కట్టే అవకాశం ఉందా? అని అడిగితే మాత్రం నో.. నెవ్వర్ అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్ లేదని చెప్పేసింది. నమత్రతో మాట్లాడుతుంటే.. ఆమెకున్న స్పష్టత చూసినప్పుడు ముచ్చటేయటం ఖాయం.