Begin typing your search above and press return to search.
పెళ్లి.. కెరీర్ పై నమ్రత షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 March 2023 5:18 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా హిందీతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆమె మోడలింగ్ లో రాణించి మిస్ ఇండియా కిరిటాన్ని సొంతం చేసుకుంది. ఇన్ని గొప్ప పురష్కారాలు.. గొప్ప జీవితాన్ని సొంతం చేసుకున్నా కూడా నమ్రత మాత్రం చాలా సింపుల్ జీవితాన్ని సాగిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు.
ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా నమ్రత ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్ మరాఠీ నటి అవ్వడం వల్ల తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు అంది. తన కెరీర్ లో మరియు జీవితంలో చాలా విషయాలు ప్లాన్ చేయకుండానే అలా జరిగి పోయాయి అంది.
మోడలింగ్ లో 1993 లో మిస్ ఇండియా కిరిటాన్ని సొంతం చేసుకున్నాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కెరీర్ లో చాలా ఎదుగుదలను చూశాను. తెలుగు సినిమాల్లో నటించిన సమయంలో కూడా తనను ప్రేక్షకులు అభిమానించాలనే ఉద్దేశ్యంతోనే పని చేశాను అన్నట్లుగా నమ్రత శిరోద్కర్ చెప్పుకొచ్చింది.
నమ్రత పెళ్లి తర్వాత సినీ కెరీర్ కు స్వస్థి చెప్పడంను ఇప్పటికి కూడా చాలా మంది తప్పుబడుతున్నారు. నమ్రత చేత మహేష్ బాబు బలవంతంగా సినిమాలు మానిపించేశాడేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కానీ నమ్రత ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వాలి అనేది నా సొంత నిర్ణయం. ఆ విషయంలో మహేష్ కానీ మరెవ్వరి యొక్క సలహా... సూచన లేదని.. వార్నింగ్ కానీ లేదని తన భర్త మహేష్ కు క్లీన్ షీట్ ఇచ్చింది. అంతే కాకుండా మళ్లీ అవకాశం వచ్చినా కూడా నేను మహేష్ బాబు నే వివాహం చేసుకుంటాను అన్నట్లుగా నమ్రత చెప్పుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.