Begin typing your search above and press return to search.
బ్రహ్మోత్సవం కోసం భార్య స్కెచ్ లు
By: Tupaki Desk | 9 May 2016 6:31 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం రిలీజ్ కి రెడీ అయిపోతోంది. మే 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో బ్రహ్మోత్సవం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ టాప్ రేంజ్ కి చేరిపోయాయి. ఇప్పుడు ఈ పబ్లిసిటీ వర్క్స్ ని హ్యాండిల్ చేయడానికి మహేష్ భార్య నమ్రత కూడా రంగంలోకి దిగిపోయింది.
మహేష్ కెరీర్ లో శ్రీమంతుడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ఈ చిత్రాన్ని ప్రచారం చేసిన తీరు కూడా చాలా హెల్ప్ చేసింది. బాహుబలి కారణంగా శ్రీమంతుడు విడుదలకు మూడు వారాలు సమయం దొరకడంతో.. ఆ టైంని పక్కాగా ఉపయోగించుకుంది నమ్రత. కొందరు ఎంబీయే గ్రాడ్యుయేట్స్ సహాయం తీసుకుని పక్కాగా ప్లాన్ చేసి, ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా నమ్రత పబ్లిసిటీ పనులు హ్యాండిల్ చేసింది. ఇప్పుడు బ్రహ్మోత్సవం రిలీజ్ కి రెడీ అవడంతో మరోసారి తన స్ట్రాటజీలను ఉపయోగించడానికి మహేష్ వైఫ్ సిద్ధమైంది.
జి మహేష్ బాబు ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. మహేష్ బాబు సొంత బ్యానర్ కూడా బ్రహ్మోత్సవం నిర్మాణంలో ఒక భాగం. అందుకే రిజల్ట్ విషయంలో మహేష్ అండ్ ఫ్యామిలీ పక్కాగా ప్లానింగ్ తో ఉన్నారు. శ్రీమంతుడును సక్సెస్ ఫుల్ 80కోట్ల షేర్ లెక్క దాటడంతో.. ఇప్పుడు బ్రహ్మత్సవంను 100 కోట్ల మార్క్ దాటించేలా వ్యూహాలు రెడీ చేశారని తెలుస్తోంది. బ్రహ్మోత్సవం పబ్లిసిటీ పనులు నమ్రత చేపట్టిందని తెలిసిన అభిమానులు.. ఇప్పుడు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.