Begin typing your search above and press return to search.
స్టార్ వైఫ్ ప్రచారార్భాటం
By: Tupaki Desk | 14 Dec 2018 2:54 PM GMTసూపర్ స్టార్ ని తయారు చేసిన మేటి భార్యామణిగా నమ్రత గురించి సన్నిహితులు కీర్తిస్తుంటారు. మహేష్ లుక్ డిజైన్ - కాస్ట్యూమ్ సెలక్షన్ నుంచి ప్రతిదీ నమ్రతనే. మహేష్ ప్రతి అడుగులోనూ నమ్రత ప్రణాళిక ఉందని - తనదైన మాష్టర్ మైండ్‌తో ఇంతింతై వటుడింతై అన్న చందంగా మహేష్‌ని తీర్చిదిద్దిన గ్రేట్ పర్సనాలిటీ తనేనని అందరూ చెబుతుంటారు. మోడ్రన్ వరల్డ్ లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగితే వేగంగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందో అలాంటి మాష్టర్ మైండ్ నమ్రత అని పొగిడేస్తుంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేటి ఏఎంబీ సినిమాస్ ఫ్రాంఛైజీ.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దిన చందంగా నమ్రత ఏ దశలోనూ ఏమరుపాటుగా ఉండరనడానికి తాజా బిజినెస్ ఫ్రాంఛైజీ ప్రత్యక్ష సాక్ష్యం. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ హబ్ గుండెకాయలో ఏఎంబీ సినిమాస్ రూపకల్పనకు ఏనాడో ప్లాన్ వేసింది నమ్రతనేనట. ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయవంతంగా తొలి అడుగు వేసే వరకూ ప్రతిదీ ప్లానింగ్ నమ్రతనే. ఓవైపు సూపర్ స్టార్ మహేష్ కెరీర్ తో బిజీబిజీగా ఉంటే - తెరవెనక బిజినెస్ వ్యవహారాల్ని చక్కబెట్టింది నమ్రత. ఇక ఏఎంబీ సినిమాస్ లో ఫెసిలిటీస్ - ఇంటీరియర్ డిజైన్ సహా రిచ్ లుక్ వెనక నమ్రత అభిరుచి ఉందన్నది ఘట్టమనేని అభిమానులు చెబుతున్న మాట. ఇక ఇటీవలే 2.0 చిత్రంతో ఏఎంబీ సినిమాస్ ని లాంచ్ చేసింది మొదలు - నిత్యం ప్రచారార్భాటంతో అదరగొట్టేస్తున్నారు ఈ స్టార్ వైఫ్.
ఏఎంబీ మాల్ ని ఎన్ని కోణాల్లో పబ్లిసిటీ చేసి జనాలకు చేరువ చేయాలో అన్ని కోణాల్లోనూ నమ్రత ప్రచారం ఊదరగొట్టేయడం చర్చకొచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జనాల చూపు అంతా ఏఎంబీ సినిమాస్ పైనే. అప్పుడే ఈ ఏరియాలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇంకా మాల్ నిర్మాణంలో పెండింగ్ పనులు ఉండగానే అప్పుడే రెగ్యులర్ విజిటర్స్ పెరిగారు. టాప్ ఫ్లోర్ లో స్క్రీన్లు అన్నీ లాంచ్ అయ్యాయి కాబట్టి..ఇక్కడికి సినిమాలు చూసేందుకు జనం దూసుకొస్తున్నారు. ఇక నమ్రత రెగ్యులర్ బేసిస్ లో అసలు ఏఎంబీ సినిమాస్ లో సౌకర్యాల్ని పరిశీలిస్తున్నారని ఇదిగో ఈ విజిటింగ్ చూస్తే అర్థమవుతోంది. ఏఎంబీ మాల్- ఎం లాంజ్ ఆసమ్ మెనూ! అంటూ కితాబునిస్తూ ఓ ఫోటోని షేర్ చేశారు నమ్రత. ఎమ్ - లాంజ్ కే కాదు.. ఈ ఫోటోలో నమ్రత లుక్ కి అభిమానుల నుంచి అదిరిపోయే ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఓ అభిమాని మాత్రం తనకు ఎదురైన అనుభవాన్ని అప్పుడే నమ్రతకు పోస్ట్ చేసేశాడు. ఏఎంబీ సినిమాస్ థియేటర్ లో ఆడి 5- ఏ1 రిక్లయినర్ పని చేయడం లేదు. కాస్త చెక్ చేయరూ? అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. మొత్తానికి ఇలాంటి రిపెయిర్లు లేకుండా ఏఎంబీని సమర్థంగా నిర్వహించేందుకు మ్యాడమ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనే భావిద్దాం.