Begin typing your search above and press return to search.
రాజకీయాలకు పనికి రావని రజినీకి చెప్పా
By: Tupaki Desk | 20 Jan 2018 7:19 AM GMTరెండు దశాబ్దాల సందిగ్ధతకు తెర దించుతూ ఎట్టకేలకు తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేశాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఐతే ఆయన రాజకీయారంగేట్రం ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో రజినీ రాజకీయాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తాడని.. తమిళనాడు తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే అని అంటున్నారు. ఇంకొందరేమో రజినీ రాజకీయాల్లో బోల్తా కొట్టడం ఖాయమని అంటున్నారు. ఐతే రజినీ ఈ ప్రకటన చేయడానికంటే ముందే.. ఆయన రాజకీయాల్లో విజయవంతం కాలేడంటూ నేరుగా ఆయనకే మొహమాటం లేకుండా చెప్పేశాడట ఓ వ్యక్తి. ఆయనెవరో కాదు.. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్.
నానా పటేకర్ తొలిసారిగా రజినీకాంత్ తో కలిసి ‘కాలా’ సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని నెలల కిందట ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా రజినీ రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఇద్దరి మధ్య చర్చ జరిగిందట. ఆ సందర్భంగా రజినీ రాజకీయాలకు పనికి రాడంటూ ఆయనతోనే సూటిగా చెప్పేసినట్లు నానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మంచితనం మాత్రమే ఉంటే రాజకీయాలకు సరిపోదని.. అందులోనూ రజినీ మరీ సింపుల్ గా.. నిజాయితీగా ఉండే వ్యక్తి అని.. అలా ఉంటే రాజకీయాల్లో దెబ్బ తినడం ఖాయమని.. రాజకీయాలంటే అందరినీ బురిడీ కొట్టించాలని.. అడ్డదారులు తొక్కాలని.. ఇవన్నీ రజినీకి సాధ్యం కాదు కాబట్టి ఆయన విజయవంతం కాలేడని అభిప్రాయపడ్డట్లు నానా తెలిపాడు. అసలు సినీ తారలు రాజకీయాల్లోకి రావడం మీదే తనకు సదభిప్రాయం లేదని నానా చెప్పడం విశేషం. మహారాష్ట్రలో రైతుల కోసం కోట్ల రూపాయలు సాయం చేస్తూ వారి ఆత్మహత్యల్ని ఆపేందుకు నానా చేస్తున్న కృషి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే.