Begin typing your search above and press return to search.
బాలయ్య ‘గాడ్ ఫాదర్’గా మారేది ఎప్పుడంటే..
By: Tupaki Desk | 24 Nov 2015 9:45 AM GMTఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ లాంటి సూపర్ స్టార్లు ఒకప్పుడు వందల సినిమాల్లో నటించారు. కానీ తర్వాతి తరం స్టార్ హీరోలు ‘100’ నంబర్ అందుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఒక్క చిరంజీవి మాత్రమే ఈ నంబర్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలయ్యకు మాత్రమే ఈ ఘనత సాధ్యమవుతోంది. ఈ రోజుల్లో 100వ సినిమా అంటే చాలా చాలా ప్రత్యేకమైన విషయం. అందుకే ఇంకా మొదలైనా కాకముందే బాలయ్య సెంచరీ సినిమా మీద విపరీతమైన ఆసక్తి ఉంది జనాల్లో. దీని గురించి రెండు సంవత్సరాల కిందటే చర్చ మొదలైంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడన్నది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అంతకుమించి చాలా కాలంగా ఎలాంటి అప్ డేట్స్ లేవు.
ఇప్పుడు బాలయ్య వందో సినిమా గురించి ఒక్కో అప్ డేట్ బయటికి వస్తోంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యేది కూడా తేలిపోయింది. వచ్చే ఏడాది జూన్ 10న సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగుని డిసెంబర్ లోనే పూర్తి చేయబోతున్నాడు బాలయ్య. ఐతే 100వ సినిమా చాలా స్పెషల్ కాబట్టి తొందర పడట్లేదు. బోయపాటి బన్నీ సినిమా నుంచి ఫిబ్రవరికి ఖాళీ అవుతాడు. ఆ తర్వాత నాలుగు నెలలు ‘గాడ్ ఫాదర్’ మీదే కూర్చుంటాడు. ఇప్పటికి లైన్ మాత్రమే బాలయ్యకు వినిపించాడు. తర్వాత పూర్తి స్థాయి స్క్రిప్టు రెడీ చేయబోతున్నాడు. కాబట్టి బాలయ్య పుట్టిన రోజుకే ‘గాడ్ ఫాధర్’ ఆరంభోత్సవం జరగడం ఖాయం.