Begin typing your search above and press return to search.
CCC సాయం..బాలయ్య రియాక్షన్ వేరే లెవల్లో!
By: Tupaki Desk | 3 April 2020 8:10 AM GMTకరోనా కల్లోలంలో కష్టాలు పాలైన సినీకార్మికులకు అండగా మేమున్నాం అంటూ ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్లు విరివిగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరు నిత్యావసర సరుకుల్ని కార్మికుల ఇండ్లకు వెళ్లి మరీ సాయం చేస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా మెగా కాంపౌండ్ హీరోలంతా కలిపి గంపగుత్తగా సుమారు 2-3కోట్ల వరకూ కరోనా సాయం ప్రకటించారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీసీసీ చారిటీ ని ప్రారంభించి నిధిని సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటికే సుమారు 7-8 కోట్లు జమ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. పలువురు స్టార్లు సీఎం నిధితో పాటు సీసీసీ కార్మిక నిధికి డొనేట్ చేశారు. దాతల్లో ప్రభాస్ 4కోట్లు (ఇందులో కొంత ఇండస్ట్రీకి) అన్నిరకాల సాయం ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. నానీ టాలీవుడ్ - సీసీసీ నిధికి ఏకంగా 30లక్షలు డొనేట్ చేసి బెస్ట్ అనిపించాడు. ఇతరులు తమకు తోచినంత సాయం ప్రకటించారు. అయితే ఇంతమంది ఇన్నిరకాలుగా సాయం చేస్తుంటే పలువురు స్టార్లు మాత్రం ఇంకా ఏం చేయాలి? అని నాన్చుతూ ఉన్నారు. వీళ్లందరిపైనా సోషల్ మీడియాల్లో ఇప్పటికే బోలెడన్ని పంచ్ లు పడిపోతున్నాయి.
ఇకపోతే తాజాగా నందమూరి బాలకృష్ణ కరోనా సాయానికి ముందుకొచ్చారు. సీసీసీకి 25 లక్షల మేర విరాళం అందించారు. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం నిధికి చెరో 50లక్షల చొప్పున డొనేట్ చేశారు. ఈ సాయంపై సినీవర్గాలు సహా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదంతా సరే కానీ.. ఒకవేళ సీసీసీ నిధి విరాళాలు సరిగా నిర్ధేశిత కార్మిక లోకానికి అందలేదని తెలిసిందో..! బాలయ్య రియాక్షన్ కూడా వీళ్లపై వేరే లెవల్లో ఉంటుంది అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాల్లో కామెంట్లు స్టార్ట్ చేయడం చర్చకొచ్చింది. ఇక లాక్ డౌన్ సమయంలో మాకెందుకులే అనుకోకుండా వెటరన్ స్టార్లు ఇలా సాయానికి ముందుకు రావడం మెచ్చదగిన పరిణామం.