Begin typing your search above and press return to search.
సరికొత్త అవతార్ లో బాలయ్య.. ఈసారి అంతకుమించి..!
By: Tupaki Desk | 2 Oct 2022 3:19 AM GMTనటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షోతో ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' కోసం తొలిసారిగా హోస్ట్ అవతారమెత్తిన బాలయ్య.. ఎంట్రీతోనే అదరగొట్టాడు. సీనియర్ హీరోలని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ షో.. పెద్ద సక్సెస్ సాధించింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ మీద అందరి దృష్టి పడింది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ''అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే'' సీజన్-2 కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోస్టర్స్ - షో అంథెం ద్వారా సీజన్ అప్డేట్స్ ఇచ్చిన నిర్వాహకులు.. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ''అన్ స్టాపబుల్ - 2'' ప్రోమోకి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సీజన్ ప్రోమో కాన్సెప్ట్ ను డిజైన్ చేసిన ప్రశాంత్.. ఇప్పుడు మరింత గ్రాండ్ గా సరికొత్తగా సీజన్-2 ప్రోమోని రూపొందిస్తున్నారు. అయితే ఈసారి బాలయ్యను ఎవరు ఊహించని విధంగా న్యూ అవతార్ లో చూపించబోతున్నారు.
ప్రస్తుతం 'అన్ స్టాపబుల్ - 2' ప్రోమో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే NBK107 ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగొచ్చిన బాలయ్య.. వెంటనే ప్రశాంత్ వర్మ తో షూట్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆహా టీమ్ వెల్లడిస్తూ ప్రశాంత్ వర్మ - బాలకృష్ణ కు సంబంధించిన లొకేషన్ లోని పిక్ ని షేర్ చేసింది. అక్టోబర్ 4 ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ట్వీట్ చేస్తూ.. ''ఒక్కసారి బాలకృష్ణ గారితో కలిసి పనిచేయడం కల.. రెండు సార్లు అయితే విధి! #UnstoppablewithNBK సీజన్ 2 ప్రోమో షూట్ ప్రోగ్రెస్ లో ఉంది!! మీ అందరికీ సీజన్-1 ప్రోమో నచ్చింది.. ఈసారి అంతకు మించి ఉంటుంది!! అక్టోబరు 4న మునుపెన్నడూ చూడని అవతార్ లో అతనిని చూసేందుకు సిద్ధంగా ఉండండి'' అని పేర్కొన్నారు.
''సీజన్-1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని గట్టిగా అనుకున్నాను. అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహా టీం సీజన్ 2 కోసం స్టోరీ రాయాలి అనగానే ఒప్పుకున్నాను. బాలయ్య గారితో పనిచేయమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని 'అన్ స్టాపబుల్ 2' గురించి దర్శకుడు చెప్పుకొచ్చారు.
'అన్ స్టాపబుల్ 2' ట్రైలర్ ను అక్టోబర్ 4న విజయవాడలో దాదాపు 20 వేల మంది అభిమానుల సమక్షంలో ప్రదర్శించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది రెండో సీజన్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గా జరగనుందని అంటున్నారు. ఇదే నిజమైతే తెలుగులో మరియు ఓటీటీలో ఒక టాక్ షో కోసం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది.
ఇకపోతే ఆహాలో ప్రసారం కానున్న 'అన్ స్టాపబుల్' సీజన్-2 మొదటి ఎపిసోడ్ కు బాలకృష్ణ బావ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు, బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథిలుగా పాల్గొంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.