Begin typing your search above and press return to search.

పాతవి వదిలించుకుంటున్న బాలయ్య

By:  Tupaki Desk   |   28 March 2016 11:30 AM GMT
పాతవి వదిలించుకుంటున్న బాలయ్య
X
సినిమా స్టార్లు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే అంశాల్లో ప్రధానమైనది వాళ్లు ఉపయోగించే కార్లే. కొత్త మోడల్ రావడం ఆలస్యం.. స్టార్లు వాటిని కొనుగోలు చేసేస్తూ ఉంటారు. కాస్ట్లీ కార్ల విషయంలో ఈ మోజు ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఇలా కొత్త కార్ల వాడకం స్టేటస్ సింబల్ అనే ఫీలింగ్ కూడా వీటి పట్ల సెలబ్రిటీలు మోజు పెంచుకోవడానికి కారణంగా చెప్పచ్చు.

కానీ ఇలా కార్ల కోసం ఆడంబరాలు ప్రదర్శించడంలో నందమూరి బాలకృష్ణ పేరు చాలా తక్కువగా వినిపిస్తుంది. ఆయన దగ్గర చాలానే కార్లు ఉన్నా.. కొత్తవాటికోసం పాకులాడే మెంటాలిటి బాలయ్యకు అంతగా లేదు. కానీ ఇప్పుడు టైం మారిపోతోంది. బాలయ్య కూడా పాత కార్లను వదిలించేసుకుంటున్నారట. రీసెంట్ గా ఆయనకు ఎంతో ఇష్టమైన సిల్వర్ కలర్ స్కోడా కారుతో పాటు మరో వెహికల్ ను సేల్ చేసేశారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కార్ల సెంటిమెంట్ ను మార్చుకోవడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉందట. పాత కార్లమీద మోజు తీరిపోయి అమ్మేయడం లాంటిది కాదు బాలయ్య స్టైల్.

కొన్ని కార్లకు ఉన్న నెంబర్లు.. బాలకృష్ణకు న్యూమరాలజీ ప్రకారం అచ్చి రావని ఓ న్యూమరాలజిస్ట్ సూచించడంతోనే.. ఇలా ఎంపిక చేసిన కార్లను బాలయ్య అమ్మేస్తున్నారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది అమ్మడం కూడా ఆయన వదలించేసుకుంటున్నారన్న మాట. ఈ పాత కార్లు అమ్మేశాక మరి బాలయ్య కొనబోయే కొత్త కార్ ఎలా ఉంటుందో, ఏ బ్రాండ్ ని కొంటారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.