Begin typing your search above and press return to search.

డైరెక్టర్ బి.గోపాల్ తో బాలయ్య మరో సినిమానా..?

By:  Tupaki Desk   |   23 March 2020 6:35 AM GMT
డైరెక్టర్ బి.గోపాల్ తో బాలయ్య మరో సినిమానా..?
X
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటసింహం అంటేనే నందమూరి బాలకృష్ణ. ఆయన చివరిగా అందుకున్న బ్లాక్ బస్టర్ 'లెజెండ్'. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలే తీశారు కానీ లెజెండ్ అంత రేంజ్ కి ఏది వెళ్ళలేదు. ముఖ్యంగా బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఇండస్ట్రీలో తిరుగులేని విజయాలను, అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.

ఇటీవల బాలయ్య-బోయపాటి ల కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది అంటే అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరికీ హిట్లు లేవు. మరి ముచ్చటగా మూడోసారి జతకట్టే సరికి సింహ, లెజెండ్ లాంటి హిస్టరీ రిపీట్ అవుతుందా..? అని సినీ వర్గాలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, డైలాగ్స్ భారీ లెవెల్ లో ఎక్సపెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చూపించనున్నారో అని ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ "అయ్యప్పనుమ్ కోశియం" సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ వారు దక్కించుకున్నారు. ఒక హవాల్దార్, పోలీస్ ఆఫీసర్ ల ఇగో మధ్య సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ రెండు పాత్రల కోసం సీనియర్ హీరోలను పరిశీలిస్తున్నారట. అందులో ఒక క్యారెక్టర్ కోసం బాలయ్య బాబును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ డైరెక్ట్ చేస్తాడని టాలీవుడ్ కోడై కూస్తుంది. మరి కథ నచ్చితే దర్శకుడు ఎవరనేది కూడా చూడని బాలయ్య మంచి కథాంశం ఉన్న మలయాళ రీమేక్ సినిమాను తన ఫేవరెట్ డైరెక్టర్ గోపాల్ తీస్తాడంటే ఒప్పుకుంటాడు కావచ్చు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి బాలయ్య నుండి ఎలాంటి సమాచారం రానుందో..!