Begin typing your search above and press return to search.
స్టార్ హీరో టీషర్ట్ హాట్ టాపిక్ గా మారిందే!
By: Tupaki Desk | 31 July 2022 5:32 AM GMTమన టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ప్రత్యేకంగా చూస్తుంటారు. వారు వాడే ఫోన్ దగ్గరి నుంచి వేసుకునే డ్రెస్, షూస్ వరకు ఎక్కడ కొన్నారు?..వాటి ఖరీదు ఎంత అని ఆరా తీస్తుంటారు. వాటి గురించి తెలుసుకని మురిసిపోతుంటారు. తాజాగా శుక్రవారం నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఓ ప్రత్యేకమైన దాని గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఫిక్షన్ పీరియాడిక్ డ్రామా `బింబిసార`.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. 5వ శతాబ్దం నాటి మగధ లోని త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడి కథని నేటి కాలానికి లింకప్ చేస్తూ ఈ మూవీని రూపొందించారు.
రీసెంట్ గా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. చాలా కాలం తరువాత నందమూరి కల్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన సినిమా కావడం, పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ మూవీ కావడంతో సగటు ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. ఆగస్టు 5న అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. కల్యాణ్ రామ్ గురించి, `బింబిసార` గురించి ఏ రేంజ్ లో హైప్ ఇవ్వాలో ఆ రేంజ్ లో హైప్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపించారు. బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్ టీషర్ట్ వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఇప్పడు ఎన్టీఆర్ వేసుకున్న టీషర్ట్ హాట్ టాపిక్ గా మారింది.
పారిస్ కి చెందిన kar Lagerfeld కంపనీకి చెందిన టీషర్ట్ ఇది. దీంతో అభిమానులు, నెటిజన్ లు ఈ టీషర్ట్ ధర ఎంత వుంటుందని నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. దీని ధర రూ. 24,000 గా నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మధ్య అల్లు అర్జున్ ధరించిన టీషర్ట్స్ బాల్మయిన్, గివెంచీ కూడా ఇటీవల నెట్టింట ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.