Begin typing your search above and press return to search.
నందమూరి ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది: కల్యాణ్ రామ్
By: Tupaki Desk | 29 July 2022 5:15 PM GMTకల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో ఆయన హీరోగా నిర్మితమైన 'బింబిసార' .. ఆగస్టు 5వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. చారిత్రక నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ తో కూడిన టచ్ ఇస్తూ అల్లుకున్న కథ ఇది. రెండు విభిన్నమైన పాత్రలలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు.
ఆయన సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు .. శిల్పకళావేదికలో నిర్వహించారు. ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఈ వేడుక జరిగింది.
ఈ స్టేజ్ పై కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. " మనందరికీ చందమామ కథలంటే .. జానపద చిత్రాలంటే చాలా ఇష్టం. తాతగారు చేసిన 'పాతాళభైరవి' .. బాబాయ్ చేసిన 'భైరవద్వీపం' .. చిరంజీవిగారు చేసిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఇలా ఎన్నో సినిమాలు మన ముందుకు వచ్చాయి.
అలాంటి ఒక సోషియో ఫాంటసీ సినిమా మీ ముందుకు తీసుకుని రావాలనే ఉద్దేశంతో మేము చేసిన ప్రయత్నమే ఈ 'బింబిసార'. ఆగస్టు 5వ తేదీన మీరంతా థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి. ఈ సారి మాత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయను.
వందకి రెండువందల శాతం మీరంతా సంతృప్తి చెందుతారు .. అందులో ఎలాంటి సందేహం లేదు. మా తాతగారి శత జయంతి సందర్భంలో వచ్చిన ఈ సినిమాను చూసి అభిమానులంతా గర్వపడేలా ఉంటుంది. తెలుగు సినిమాకి .. మాకు .. మూలకారకులు ఆయనే. అందుకే ఈ సినిమాను ఆయనకి అంకితం చేశాము. ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా కోసం వశిష్ఠ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి ప్రాణం పోసింది కీరవాణిగారు.
ఈ సినిమాకి కర్త .. కర్మ .. క్రియ ఒకే ఒక వ్యక్తి హరిబాబు. తెరవెనుక తాను ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఇంతపెద్ద సినిమాను నాకు ఇచ్చిన హరికి రుణపడి ఉంటాను. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన నా తమ్ముడు తారక్ కి థ్యాంక్స్ చెప్పలేను. ఎందుకంటే తను నాలో ఒక భాగం కనుక. ఆగస్టు 5వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వస్తోంది .. చూసి ఎంజాయ్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు.