Begin typing your search above and press return to search.
నాగబాబుకు నందమూరి ఫ్యాన్ వార్నింగ్
By: Tupaki Desk | 9 Jan 2019 11:53 AM GMTగత కొన్ని రోజులుగా బాలకృష్ణల పై నాగబాబు చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మద్య వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్టీఆర్’ విడుదలైంది. ‘ఎన్టీఆర్’ చిత్రం విడుదల సందర్బంగా ఐమాక్స్ వద్ద నందమూరి అభిమాని ఒకరు మీడియాతో మాట్లాడుతూ నాగబాబు వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హీరోల మద్య వాతావరణం ఎలా ఉండాలో తెలియాలంటే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చూడాలంటూ నాగబాబుకు సదరు అభిమాని సలహా ఇచ్చాడు.
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ మొదటి ఆట ముగిసిన తర్వాత అభిమాని మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎలా ఎదిగారు, ఇండస్ట్రీలో కష్టాలు పడి స్టార్ గా ఎలా ఎదిగారనేది చూపించారు. ఆ సమయంలో ఎన్టీఆర్, ఏయన్నార్ ల మద్య ఎలాంటి స్నేహ పూర్వక వాతావరణం ఉండేదనే విషయాలను చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాలు నాగబాబు గారు చూడాలి, ఆయన మాట్లాడిన మాటలు, వాడిన భాషపై దారుణం. తెలుగోడిగా పుట్టినందుకు గర్వించాలి, ఆ విషయాలను తెలియాలంటే నాగబాబు గారు వెళ్లి ఈ సినిమా చూడాలి. బాలకృష్ణ గారిపై విమర్శలు చేయాలనుకుంటే కథానాయకుడు, మహానాయకుడు విడుదలైన తర్వాత విమర్శలు చేయవచ్చు కదా, కుళ్లు, కుతంత్రంతోనే నాగబాబు గారు బాలకృష్ణ గారిపై విమర్శలు చేశారు.
కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీ రామారావు గారే చేయగలరు, దాని తర్వాత బాలకృష్ణ గారే చేయగలరు. ఈ చిత్రంలోని ఒక సీన్ తో బాలకృష్ణ గారు నిరూపించారు. కృష్ణుడిగా మెగా స్టార్ గారి ఫ్యామిలీలో ఎవరినైనా తీయమనండి, ఎవరైనా చూస్తారో చూద్దాం. బాలకృష్ణ గారు బ్లడ్ వేరు అన్నది బాలకృష్ణ గారు రాజకీయాల గురించి మాట్లాడుతున్న సందర్బంగా కామన్ గా అన్న పదం. తెలుగు జాతి గర్వించే విధంగా ఎన్టీఆర్ గారు ఉన్నారు. అలాంటి ఎన్టీఆర్ జీవితాన్ని ఈ చిత్రంలో అద్బుతంగా చూపించారు అంటూ సదరు అభిమాని కామెంట్ చేశాడు