Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కు ఇప్పుడైనా ఛాన్స్‌ ఇవ్వొచ్చుగా బాలయ్య?

By:  Tupaki Desk   |   1 Sep 2018 4:48 AM GMT
ఎన్టీఆర్‌ కు ఇప్పుడైనా ఛాన్స్‌ ఇవ్వొచ్చుగా బాలయ్య?
X
నందమూరి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు మరియు ఫ్యాన్స్‌ షాక్‌ లో ఉన్నారు. ఈ సమయంలోనే ఫ్యాన్స్‌ కు కాస్త ఊరట కలిగించే విషయం బాబాయి - అబ్బాయిల కలయి. చాలా కాలంగా బాలకృష్ణ - ఎన్టీఆర్‌ ల మద్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనేమో అన్నట్లుగా చాలా కాలంగా వీరిద్దరు కలిసిందే లేదు. దాంతో నందమూరి అభిమానులు ఈ బాబాయి - అబ్బాయిలు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు హరికృష్ణ మరణం సందర్బంగా బాలయ్య - ఎన్టీఆర్‌ లు కలిసి పోయారు.

ఈ సమయంలోనే నందమూరి ఫ్యాన్స్‌ లో కొత్త కోరికలు కలుగుతున్నాయి. మొన్నటి వరకు బాబాయి - అబ్బాయి కలవాలని కోరుకున్న ఫ్యాన్స్‌ ఇప్పుడు అది నెరవేరడంతో మరో కోరిక కోరుకుంటున్నారు. ప్రస్తుతం నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ను బాలయ్య చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ గా బాలయ్య నటిస్తుండగా - హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నారు. ఇదే సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎలాగూ నందమూరి హీరోలు కలిసి పోయారు కనుక ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ‘ఎన్టీఆర్‌’ సినిమా స్థాయిని పెంచేందుకు బాలయ్య బాబు కాస్త మంచి మనసు చేసుకుని జూనియర్‌ కు ఛాన్స్‌ ఇవ్వాలని అభిమానులు వేడుకుంటున్నారు. మరి అభిమానుల వేడుకోలును బాలయ్య బాబు వింటాడా అనేది చూడాలి.