Begin typing your search above and press return to search.
నందమూరి వార్.. ఇప్పుడే ఇలా ఉంటే
By: Tupaki Desk | 31 Dec 2015 11:06 AM GMTనందమూరి హీరోల కాంప్రమైజింగ్ ఫార్ములా అట్టర్ ఫ్లాప్ అయిందని తేలిపోయింది. బాబాయికి అబ్బాయి సారీ చెప్పడం.. ఇద్దరూ కాంప్రమైజ్ అయిపోవడం అంతా కూడా హంబక్కే అని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. మొన్న నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ సందర్భంగా నెలకొన్న పరిణామాలు.. ఆ తర్వాత నందమూరి అభిమానుల మధ్య అంతర్యుద్ధం.. అంతా చూస్తుంటే బాబాయి, అబ్బాయి మధ్య పోరు కొంచెం గట్టిగానే సాగుతున్నట్లు అర్థమవుతోంది.
జూనియర్ కు పెద్ద ఎన్టీఆర్ తన పేరును దానం చేశాడని.. అతను తన అంశ అని చెప్పాడని అనడంతో ద్వారా తన కొడుకే తన తండ్రికి సరైన వారసుడని చెప్పకనే చెప్పాడు హరికృష్ణ. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా వాట్సాప్ లో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మెసేజ్ లు కూడా నడుస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. నందమూరి కుటుంబానికి ఏకైక నట వారసుడు బాలయ్య అంటూ కోస్తా జిల్లాల్లో ‘డిక్టేటర్’ పోస్టర్లు కూడా దర్శనమిస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఐతే ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాలు రిలీజైనపుడు ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో అని నందమూరి అభిమానుల్లో ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు ‘బాద్ షా’ విడుదలైనపుడు నందమూరి అభిమానుల్లో ఓ వర్గం ఆ సినిమాకు వ్యతిరేకంగా పనిచేశాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఒక రోజు వ్యవధిలో అబ్బాయి, బాబాయి సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు మళ్లీ పునరావృతం కావచ్చు. అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగినా దిగొచ్చు. ఆ రెండు సినిమాల థియేటర్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం కూడా ఉంది. ఇలా అభిమానుల మధ్య కలహాలు రేగడం అన్నది నందమూరి హీరోలకు ఎంతమాత్రం మంచిది కాదు. అది అర్థం చేసుకోకుండా ఎవరికి వారు పంతానికి పోతూ అభిమానుల మధ్య వైరం మరింత పెరిగేలా చేసుకోవడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి.