Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ.. ఇంకా ఇలా ఎన్ని రోజులయ్యా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 PM GMT
మోక్షజ్ఞ.. ఇంకా ఇలా ఎన్ని రోజులయ్యా?
X
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలకు సంబంధించిన వారసులు ఎంట్రీ ఇస్తే హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అందరి ఫోకస్ నందమూరి బాలయ్య వరసుడిపైనే ఉంది. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీతో లేకపోవడం హాట్ టాపిక్ గా మారుతుంది. మొదటి సినిమాకు మోక్షం ఎప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గతంలోనే చాలాసార్లు తప్పకుండా తన వారసుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడు అని ఎంతో నమ్మకంతో చెప్పాడు.

అంతేకాకుండా ఆదిత్య 369 సీక్వెల్ కథ కూడా సిద్ధమయింది అని దానికి తానే దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉన్నట్లు తెలియజేశాడు. దీంతో అభిమానులు ఆ సమయంలో చాలా సంతోషపడ్డారు. కానీ మోక్షజ్ఞ పుట్టినరోజులు ఇప్పటికే పాతికే అయిపోయిన ఇంకా మూడు పదుల వయసులోకి రాబోతున్నా కూడా మొదటి సినిమా గురించి సరైన నిర్ణయం తీసుకోకపోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

అసలు మోక్షజ్ఞకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి ఉందా లేదా అనేది మొదటి నుంచి కలుగుతున్న అతిపెద్ద సందేహం. ఎందుకంటే కనీసం అతడు ఫిట్నెస్ విషయంలో కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు అని చూస్తేనే అర్థమవుతుంది. నందమూరి హీరో అంటే ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండకూడదు అని అభిమానులలో అంచనాలు గట్టిగానే ఉంటాయి. ఇక అఖండ సినిమా తర్వాత బాలయ్య బాబుకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

జై బాలయ్య అనే నినాదాలు నేటితరం జనరేషన్ లో కూడా గట్టిగా వినిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు మోక్షాజ్ఞ ఎంట్రీ అంటే చాలా పవర్ఫుల్ గా ఉండాలి అనే ఆలోచన ఉండకుండా ఉండదు. రీసెంట్ గా మోక్షజ్ఞ పుట్టినరోజున బాలయ్య కేక్ తినిపిస్తున్న ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

అందులోనూ మోక్షజ్ఞ పెద్దగా ఆకట్టుకునే లుక్ లో ఏమీ కనిపించడం లేదు. ఒక సాధారణ యువకుడుగానే చాలా చబ్బీ లుక్ తోనే కనిపిస్తున్నాడు. దీంతో అతను ఇంకా హీరోగా సిద్ధంగా కాలేదు అని టాక్ అయితే వస్తోంది. మరి బాలయ్య కొడుకు విషయంలో రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.