Begin typing your search above and press return to search.

లేడీ విల‌న్ తో నంద‌మూరి హీరో ఫైట్‌?

By:  Tupaki Desk   |   29 Aug 2022 4:46 AM GMT
లేడీ విల‌న్ తో నంద‌మూరి హీరో ఫైట్‌?
X
టాలీవుడ్ కు జూన్‌, జూలై కాళ‌రాత్రుల్ని మిగిల్చాయి. ఈ రెండు నెల‌ల్లో విడుద‌లైన సినిమాలు చాలా వ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ లుగా నిలిచి ఇండ‌స్ట్రీని క‌ల‌వ‌రపెట్టాయి. ఇక థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తార‌న్న‌ది క‌లేనా? .. ఇదే జ‌రిగితే సినిమాల ప‌రిస్థితి, ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి ఏంట‌నే భ‌యాందోళ‌న‌కు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు గుర‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 5న విడుద‌లైన 'బింబిసార‌', సీతారామం అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి.

భ‌యం గుప్పిట్లో వున్న ఇండస్ట్రీ వ‌ర్గాల‌కు స‌రైన‌ కంటెంట్ తో వ‌స్తే ప్రేక్ష‌కులు ఖచ్చితంగా ఆద‌రిస్తార‌ని నిరూపించి ధైర్యాన్నిచ్చాయి. ఇందులో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన 'బింబిసార‌' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. మ‌ల్లిడి వ‌శిష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి మంచి లాభాల్ని అందించ‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి ఈ మూవీపై ప‌డింది. క‌ష్ట‌కాలంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి ఇండ‌స్ట్రీకి ధైర్యాన్ని అందించిన ఈ మూవీకి త్వ‌ర‌లో సీక్వెల్ ని తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే.

17 రోజుల్లోనే రూ. 60 కోట్ల క్ల‌బ్ లో చేరి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ ని చేయ‌బోతున్నామంటూ నంద‌మూరి కల్యాణ్ రామ్ ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ముందు అనుకున్న ప్ర‌కారం 'బింబిసార 2'ని అక్టోబ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. అంతే కాకుండా 2023 ఆగ‌స్టులో సీక్వెల్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

పార్ట్ 2 లో క‌థానుసారం ఓ రాక్ష‌సి పాత్ర కీల‌కం అని చెబుతున్నారు. అందులో భాంగానే ఆ క్యారెక్ట‌ర్ కోసం పేరున్న హీరోయిన్ ని రంగంలోకి దించ‌బోతున్న‌ర‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క‌థ‌ల్లో లేడీ విల‌న్ న‌టిస్తే ఆ కిక్కే వేరుగా వుంటుంది. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన చిత్ర బృందం ఆ విష‌యంలో మ‌రిన్ని ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా హీరోయిన్ ల విష‌యంలో, వారి క్యారెక్ట‌ర్ల విష‌యంలోనూ మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వారి పాత్ర‌ల‌కు పార్ట్ 2లో మ‌రింత ప్రాధాన్య‌త వుండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధంచిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని, ఇందులో న‌టించే కీల‌క విల‌న్ పాత్ర‌ధారి ఎవ‌రు? .. ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌కు సంబంధించిన మ‌రిన్ని విశేషాల‌ని వెల్లడించ‌నున్నార‌ని తెలిసింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ 'బింబిసార 2'ని నిర్మించ‌బోతున్నారు. పార్ట్ 1 హ్యూజ్ స‌క్సెస్ కావ‌డ‌మే కాకుండా భారీ లాభాల్ని అందించ‌డంతో పార్ట్ 2 ని మిరింత భారీ బ‌డ్జెట్ తో నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.