Begin typing your search above and press return to search.
నందమూరి...నచ్చుతున్నాడే...?
By: Tupaki Desk | 29 Dec 2021 6:34 AM GMTనందమూరి బ్రాండ్ కి టాలీవుడ్ లో డెబ్బై ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. సీనియర్ ఎన్టీయార్ 1949లో మనదేశం మూవీ ద్వారా చిత్ర సీమకు నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అది లగాయితు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా గ్యాప్ లో నటిస్తూనే ఉన్నారు. ఇక ఆయన వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలయ్య 1974 నుంచి ఈ రోజు వరకూ నాటౌట్ అంటూ నటిస్తూనే ఉన్నారు.
మూడవ తరంలో చూసుకుంటే జూనియర్ ఎన్టీయార్ 1996లో బాలరామాయణం ద్వారా వెండి తెరకు నటుడిగా పరిచయం అయ్యారు. కొంత గ్యాప్ తరువాత 2000 నుంచి జూనియర్ నట విన్యాసాన్ని సెల్యూలాయిడ్ మీద అంతా తిలకించి పులకిస్తూనే ఉన్నారు. ఇక సీనియర్ ఎన్టీయార్ తో మొదలుపెడితే చిత్ర సీమలో పోటా పోటీ వాతావరణం ఎపుడూ ఉంటూ వచ్చింది.
నాడు నందమూరి అక్కినేని కాంపౌండ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఒక్కోసారి అది శృతి మించి మాటలు లేని పరిస్థితి వచ్చేది. ఇక బాలయ్యకు మెగా కాంపౌండ్ తో పోటీ ఉండేది. అయితే మాట్లాడుకోవడాలు లేవు అన్న సీన్ ఎపుడూ లేదు కానీ ఇండైరెక్ట్ కామెంట్స్ తో అటూ ఇటూ ఫ్యాన్స్ ఊగిపోయేవారు.
జూనియర్ వరకూ వస్తే చరణ్ తో కానీ మెగా కాంపౌండ్ తో కానీ మొదట్లో పెద్దగా టచ్ లేకపోయినా తరువాత కాలంలో బాండింగ్ బాగా పెరిగింది. ఇక ట్రిపుల్ ఆర్ మూవీ అయితే అటు నందమూరి మెగా కాంపౌండ్ ని ఏకం చేసింది. తాజాగా చెన్నై లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చరణ్ మాట్లాడుతూ ఎన్టీయార్ ని సొంత సోదరుడి కంటే ఎక్కువ అని చెప్పుకున్నాడు. నిజంగా ఇది గ్రేట్ అనే అనాలి.
అదే సమయంలో బాలయ్యకు కూడా మెగా కాంపౌండ్ తో దూరం పూర్తిగా తగ్గిపోయింది అనాలి. ఆయన అల్లు అరవింద్ వారి అహా ఓటీటీ మీద అన్ స్టాబబుల్ అంటూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు, ఈ నేపధ్యంలో బాలయ్య అల్లు ఫ్యామిలీకే కాదు, టోటల్ మెగా కాంపౌండ్ కే నచ్చేస్తున్నాడు. మొత్తానికి చూసుకుంటే నందమూరి హీరోలు అందరికీ భలే నచ్చేస్తున్నారు అనే చెప్పాలి. ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన పరిణామం. నాటి సీనియర్ ఎన్టీయార్ నుంచి బలాయ్య, జూనియర్ వరకూ చూస్తే అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ముగ్గురూ భోళా మనుషులే. ముగ్గురివీ ఆణిముత్యాలాంటి మనసులే. అందుకే వారు అందరివారూ అవుతున్నారు అనుకోవాలి.