Begin typing your search above and press return to search.

'లోకేష్ బామ్మర్ది' లోకేష్ ని దాటిపోతున్నాడా...?

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:56 AM GMT
లోకేష్ బామ్మర్ది లోకేష్ ని దాటిపోతున్నాడా...?
X
నందమూరి తారకరామారావు నట వారసుడిగా బాలకృష్ణ తండ్రి పేరు నిలబెడుతూ ఇండస్ట్రీలో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత జెనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ 16వ ఏట ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే కోవలో నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓ వైపు మిగిలిన ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు టాలీవుడ్‌ లో దూపుకుపోతుండగా.. మోక్షజ్ఞ కూడా వీలైనంత త్వరగా ఎంట్రీ ఇవ్వాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ హీరోగా వస్తాడని అనుకున్న ప్రతిసారి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఇటీవల బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా మోక్ష‌జ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేసుంచానని.. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్ని కుదిరినప్పుడు లాంచ్ ఉంటుందని.. ఇంకా రెండేళ్ల సమయం పెట్టొచ్చని చెప్పి క్లారిటీ ఇచ్చేసాడు. అయితే అదే సమయంలో బాలయ్య బర్త్ డే వేడుకల్లో మోక్షజ్ఞ ని చూసిన నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.

కాగా బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో మోక్షజ్ఞ చూసిన ఫ్యాన్స్ అతనికి హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదేమో అనే అనుమానాలు వ్యక్తం చేసారు. దీనికి కారణం మోక్షజ్ఞ హీరో పర్సనాలిటీతో కాకుండా కాస్తంత ఒళ్లు చేసినట్టు కనపబడటం చూసి అభిమానులు నిరాశకు గురయ్యారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞలో ఈ విషయంలో మార్పు కనిపించకపోవడంతో నిజంగానే మోక్షజ్ఞకి సినిమాల మీద ఆసక్తి లేదేమో అనుకున్నారు. దీనిపై యాంటీ ఫ్యాన్స్ 'లోకేష్ బామ్మర్ది' బావ లోకేష్ ని దాటిపోతున్నాడని.. ఒకవేళ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ లా అతను ఫ్యాన్స్ కి రీచ్ కాలేకపోవచ్చు అని నెగిటివ్ కామెంట్స్ చేసారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కూడా మొదట్లో అలానే ఉండేవాడని.. ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడని కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో మోక్షజ్ఞ బాడీ మైంటైన్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసాడని.. ట్రైనర్ పర్యవేక్షణలో మోక్షజ్ఞ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.