Begin typing your search above and press return to search.
#నంది గొడవ: అసలు వీటికి విలువెంత?
By: Tupaki Desk | 22 Nov 2017 9:14 AM GMTనంది అవార్డుల రగడ మళ్లీ మొదలైంది. నారా లోకేష్ వ్యాఖ్యలతో మళ్లీ వివాదం రాజుకుంది. గతంలో ఎన్నడూ కూడా నంది అవార్డుల గురించి ఈ స్థాయిలో చర్చ జరిగిన దాఖలాలు లేవు. జాతీయ అవార్డుల విషయంలో కూడా ఇంత రగడ జరగలేదు. ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ అవార్డుల విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయింది. వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. ప్రముఖ దర్శక నిర్మాతలు మీడియా ముందుకొచ్చి అవార్డుల విషయమై తీవ్ర విమర్శలు చేశారు.
ఐతే ఇంతగా గొడవ జరిగేంత స్థాయి నంది అవార్డులకు ఉందా అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోందిప్పుడు. తెలుగు రాష్ట్రాలు కలిసున్నపుడు.. అది కూడా ఆరేడేళ్ల కిందట నంది అవార్డుల్ని అందరూ ప్రతిష్టాత్మకంగా భావించే వాళ్లు. జాతీయ అవార్డు తర్వాత అంత గొప్పగా తీసుకునేవాళ్లు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన గొడవలు మొదలై.. సినీ పరిశ్రమలోనూ అంతరాలు తలెత్తడం.. ఒక దశలో ప్రభుత్వం నంది అవార్డుల విషయాన్నే మరిచిపోయి.. రాజకీయ పరమైన కల్లోలంలో పడిపోవడంతో ఈ అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇక ఆ తర్వాత తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. సినీ పరిశ్రమ ఏమో హైదరాబాద్ లో ఉంటే.. నంది అవార్డులిచ్చే ప్రభుత్వం విజయవాడకు వెళ్లిపోయింది. దీంతో ఈ అవార్డులతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది.
దీనికి తోడు.. ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాక కొన్నేళ్లకు కలిపి ఒకేసారి అవార్డులు ప్రకటించే సంప్రదాయం మొదలైంది. దీంతో పూర్తిగా ఎగ్జైట్ మెంట్ అన్నదే లేకుండా పోయింది. అసలు ఇంతకుముందులాగా నంది అవార్డుల గురించి ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితే లేదు. అవార్డు వచ్చాక కూడా దాన్ని ఇంతకుముందులా ప్రతిష్టాత్మకంగా భావించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తంగా గతంతో పోలిస్తే నంది అవార్డుల విలువ బాగా పడిపోయిందన్నది వాస్తవం. దీనికి తోడు ఈసారి అవార్డులు ప్రకటించిన తీరుతో వాటి విలువ మరింత తగ్గింది. ఇలాంటి అవార్డులపై అసలు ఇంత రగడ అవసరమా అన్న వాదన కూడా మొదలైంది ఇప్పుడు. కాబట్టి ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేసి ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతే మంచిదేమో.